ETV Bharat / sports

IND Vs SA: కపిల్​ రికార్డుపై కన్నేసిన అశ్విన్.. మరో ఘనత కోసం షమి

author img

By

Published : Dec 25, 2021, 5:31 AM IST

Ashwin Kapil Test record: టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్, పేసర్ షమి టెస్టు రికార్డులపై కన్నేశారు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో వాటిని అందుకోవాలని చూస్తున్నారు. ఇంతకీ ఆ ఘనతలేంటి? వాటి సంగతేంటి?

IND Vs SA
IND Vs SA

Ashwin Kapil Test record: దక్షిణాఫ్రికాలో సత్తా చాటేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఆదివారం నుంచి సెంచూరియన్​లో తొలి టెస్టు ఆడనుంది. ఈ సందర్భంగా పలు రికార్డులు మన బౌలర్లను ఊరిస్తున్నాయి.

దిగ్గజ ఆల్​రౌండర్​ కపిల్​దేవ్​ రికార్డుపై స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ గురిపెట్టాడు. వికెట్ల వేటలో ఇప్పటికే మాజీ స్పిన్నర్​ హర్భజన్​ రికార్డును అధిగమించిన అశ్విన్​.. ఈ టెస్టు సిరీస్‌లో కపిల్​ రికార్డును బద్దలు కొట్టాలని భావిస్తున్నాడు.

ఒకే సిరీస్​లో రెండు రికార్డులు!

ఇప్పటివరకు 81 టెస్టులాడిన అశ్విన్‌ 427 వికెట్లు తీసి, హర్భజన్​(417)ను అధిగమించాడు. ఇప్పుడు సఫారీలతో టెస్టు​ సిరీస్​లో కపిల్‌దేవ్‌ (434) రికార్డును దాటేందుకు సిద్ధమవుతున్నాడు. అశ్విన్​ ఈ రికార్డుకు కేవలం ఎనిమిది వికెట్లు దూరంలో ఉన్నాడు. ఇదే సిరీస్​ సఫారీ మాజీ పేసర్​ డేల్​ స్టెయిల్​ను(439) కూడా అధిగమించే అవకాశముంది. ఈ సిరీస్​లో 14 వికెట్లు తీస్తే ఇద్దరి రికార్డులను అశ్విన్​ అధిగమించవచ్చు.

భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే (619), మాజీ కెప్టెన్‌ కపిల్ దేవ్‌ (434) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. అశ్విన్​, భజ్జీ తర్వాత రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

5 వికెట్ల దూరంలో షమి..

Shami test record: భారత్ పేస్​ బౌలర్​ మహమ్మద్​ షమి కూడా ఈ టెస్టు​ సిరీస్​లో 200 వికెట్ల మైలురాయిని చేరుకోవాలని ఆశిస్తున్నాడు. ఈ మార్క్​కు కేవలం ఐదు వికెట్ల దూరంలోనే ఉన్నాడు. టీమ్​ఇండియా తరఫున ఇప్పటివరకు 54 టెస్టు​లు ఆడిన షమి... 195 వికెట్లు పడగొట్టాడు. కపిల్​దేవ్​, జహీర్​ఖాన్​(311), ఇషాంత్​ శర్మ(311), జవగల్​ శ్రీనాథ్(236)​ మాత్రమే టెస్టు క్రికెట్​లో 200కుపైగా వికెట్లు పడగొట్టిన పేసర్లుగా రికార్డు సృష్టించారు.

చరిత్ర తిరగరాయాలని..

IND Vs SA: విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టుకు ఈసారి దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకునే సువర్ణావకాశం వచ్చింది. ఇప్పటి వరకు విదేశాల్లో టీమ్​ఇండియా టెస్టు సిరీస్‌ను గెలవని ఏకైక జట్టు దక్షిణాఫ్రికా. ఇప్పటివరకు ఏడుసార్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టు ఆరుసార్లు ఓటమిని చవిచూసింది. 2010-11 సంవత్సరంలో తొలిసారిగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఆఫ్రికన్ గడ్డపై టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడంలో భారత జట్టు సఫమలైంది. మూడేళ్ల క్రితం కోహ్లీ కెప్టెన్సీలో భారత్ చివరిసారిగా ఆ దేశంలో పర్యటించింది. అప్పుడు మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఓడిపోయింది.

దీంతో ఈ టెస్టు సిరీస్​లో గెలిచి.. చరిత్ర తిరగరాయాలని భావిస్తోంది టీమ్‌ఇండియా. తొలి టెస్టు డిసెంబర్ 26-30, రెండో టెస్టు జనవరి 03-07, ఆఖరి టెస్టు జనవరి 11-15 వరకు జరుగుతుంది. జనవరి 19, 21, 23వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.