ETV Bharat / sports

ప్రపంచకప్​లో పాక్​తోనే భారత్ తొలి మ్యాచ్​- హిస్టరీ​ రిపీటవుతుందా? - భారత్​ పాకిస్థాన్​ వరల్డ్​ కప్​ మ్యాచ్​

Ind vs Pak womens world cup 2022: ఐసీసీ మహిళల ప్రపంచ కప్​ ప్రారంభమైంది. గతేడాది రన్నరప్​గా నిలిచిన భారత్​ క్రికెట్​ జట్టు ఈ సారి కప్​ను ముద్దాడాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆదివారం తన తొలి మ్యాచ్​లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో తలపడునుంది. ఈ సందర్భంగా గతంలో జరిగిన మ్యాచ్​ల వివరాలు, పలు రికార్డులను పరిశీలిద్దాం.

worldcup 2022
india vs pakisthan
author img

By

Published : Mar 5, 2022, 1:31 PM IST

Ind vs Pak womens world cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్​ మార్చి 4న న్యూజిలాండ్​లో మొదలైంది. మొదటి మ్యాచ్​లో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్​, వెస్టిండీస్​​ తలపడగా.. కివీస్​ మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక అందరి చూపు ఆదివారం జరగనున్న మ్యాచ్​పై పడింది. చిరకాల ప్రత్యర్థులైన భారత్​ పాకిస్థాన్​ జట్లు తలపడటమే ఇందుకు కారణం.

ప్రపంచకప్​లో ఇప్పటివరకు రెండు సార్లు భారత్​-పాక్​ తలపడగా.. రెండింటిలోనూ టీమ్​ఇండియానే విజయం సాధించింది. కాగా, ఇరు జట్లు పది వన్డేల్లో పోటీపడగా అన్నింటా మన అమ్మాయిలే గెలిచారు. గత ప్రపంచకప్ టోర్నీ​లో రన్నరప్​గా నిలిచిన భారత్​ మహిళా జట్టు ఈ సారైనా కప్​ను​ అందుకోవాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు మధ్య జరిగిన కొన్ని మ్యాచ్​ల రికార్డులను తెలుసుకుందాం..

INDIAN WOMEN CRICKET TEAM
భారత మహిళా క్రికెట్​ జట్టు

చివరి ఐదు మ్యాచ్‌ల వివరాలివీ..

జులై 2, 2017

ఈ మ్యాచ్​లో 95 పరుగుల తేడాతో భారత్​ గెలుపొందింది. మొదట టాస్ గెలిచిన మన జట్టు 50 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్​ను 74 పరుగులకే ఆలౌట్​ చేసింది టీమ్​ఇండియా. ఏక్తా బిషిత్​(5/18) అద్భుతమైన బౌలింగ్​తో ఆకట్టుకుంది.

ఫిబ్రవరి 19, 2017

ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న భారత్​ జట్టు... ప్రత్యర్థిని 67 పరుగులకే కట్టడి చేసింది. బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియా తన చేతిలో ఏడు వికెట్లు ఉండగానే విజయం సాధించింది. ఏక్తా బిషిత్​ పది ఓవర్లలో ఐదు వికెట్ల ప్రదర్శన చేసి అందరీ దృష్టిని ఆకర్షించింది.

ఫిబ్రవరి 7, 2013

2013 మహిళల ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన పాకిస్థాన్, ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిదా దార్ 68 పరుగులు తోడవ్వడం వల్ల 50 ఓవర్లలో 192/7 స్కోర్ చేసింది. అనంతరం మిథాలీ రాజ్ 141 బంతుల్లో అజేయంగా నిలిచి 103 పరుగులు చేయడం వల్ల భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మార్చి 7, 2009

2009 మహిళల ప్రపంచ కప్‌లో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్​ కేవలం 57 పరుగులకే పాకిస్థాన్ ​జట్టును కట్టడి చేసింది. ఆ తర్వాత భారత్ కేవలం 10 ఓవర్లలోనే ఒక్క వికెట్​ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.

మే 9, 2008

2008 మహిళల ఆసియా కప్‌లో భారత్ భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 283/3 పరుగులు చేసింది. జయశర్మ, మిథాలీ రాజ్‌ అర్ధ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ 76 పరుగులకే ఆలౌటైంది. బౌలర్లు నీతూ డేవిడ్, స్నేహల్ ప్రధాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

INDIAN WOMEN CRICKET TEAM
భారత మహిళా క్రికెట్​ జట్టు

వన్డేల్లో భారత్​ VS పాకిస్థాన్​

అత్యధిక స్కోరు: 2005లో కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్ పై భారత్ 289/2 పరుగులు చేసింది.

అత్యల్ప స్కోరు: ఐసీసీ మహిళా ప్రపంచ కప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్​ను​ 57 పరుగులకే ఆలౌట్​ చేసింది.

అత్యధిక వ్యక్తిగత స్కోరు: 2005లో కరాచీలో జరిగిన మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ జయ శర్మ పాకిస్థాన్‌పై 138 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచింది.

ఓ మ్యాచ్​లో అత్యధిక వికెట్లు: 2017లో కొలంబోలో పాక్​తో జరిగిన మ్యాచ్​లో భారత మహిళా స్పిన్నర్ ఏక్తా బిషిత్ ఐదు వికెట్లు తీసింది.

ఇదీ చదవండి: అలా జరిగితే ప్రపంచకప్​ టీమ్​ఇండియాదే: మిథాలీ రాజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.