Ind Vs Pak Asia Cup 2023 : పాకిస్థాన్ బౌలర్ షహీన్ అఫ్రిదిని భారత బ్యాటర్లు ఎదుర్కోగలరా? పాక్‌తో మ్యాచ్ ముంగిట అందరిలో తలెత్తిన ప్రశ్న ఇదే. మ్యాచ్‌కు ముందు రోజు జరిగిన విలేకరుల సమావేశంలోనూ టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే షహీన్‌తో పాటు మిగతా పాక్ పేసర్లను ఎదుర్కోగల అనుభవం తమ జట్టుకు ఉందంటూ రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు. కానీ మ్యాచ్‌లో ఆ అనుభవం అక్కరకు రాలేదు. జట్టులో మేటి ప్లేయర్లైన కోహ్లి, రోహిత్ కూడా షహీన్ ముందు నిలవలేకపోయారు. బౌల్డ్ అయి నిరాశతో వెనుదిరిగారు. ఇక మిగతా బ్యాటర్లకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. షహీన్‌ను ఎదుర్కోవడం వారందరికీ శక్తికి మించిన పనే అయింది.
మరోవైపు ప్రపంచకప్‌నకు ఇంకో నెల రోజుల సమయమే ఉంది. ఈ సమయానికి జట్టు పూర్తి సన్నద్ధతతో, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కానీ మెయిన్ బ్యాటర్స్ ఎవరూ ఉత్తమ ఫామ్‌లో కనిపించడం లేదు. జట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లి, రోహిత్‌లు కూడా నిలకడగా ఆడట్లేదు. పాక్‌తో కీలక పోరులో వీళ్లిద్దరూ ఇలా విఫలమవడం క్రికెట్ అభిమానులను ఆందోళన రేకెత్తించింది.
ఇక ఐపీఎల్‌తో పాటు, అంతకుముందు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారించిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా క్రీజులో వచ్చే సమయానికి ఉన్నట్లుండి లయ కోల్పోయాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో, వెస్టిండీస్ పర్యటనలో నిరాశ పరిచిన ఈ స్టార్ ప్లేయర్.. ఇప్పుడు పాక్‌తో మ్యాచ్‌లోనూ తేలిపోయాడు. ఇక పునరాగమనంలో శ్రేయస్ సత్తా చాటుతాడు అని అందరూ అనుకుంటుంటే.. అతడి జోరు కూడా రెండు షాట్లకు పరిమితం అయింది.
Ind Vs Pak Asia Cup : ఇలా వరుస వికెట్లతో అటు రోహిత్ సేనతో పాటు అభిమానులు డీలా పడిపోతున్న సమయంలో.. బరిలోకి దిగిన ఇషాన్, హార్దిక్.. పట్టుదలతో నిలిచి పోరాడారు. అలా స్లోగా ఉన్న స్కోర్ బోర్డ్.. కాసేపటికి పరుగులు పెట్టింది. దీంతో ఆలౌటైనప్పటికీ.. భారత్ మెరుగైన స్కోరు చేయగలిగింది. లేదంటే పరిస్థితి దారుణంగా ఉండేది. ఇషాన్, హార్దిక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాక.. 300 స్కోరు చేసే అవకాశాన్ని భారత్ కోల్పోవడం వల్ల జట్టు చిక్కులో పడింది. మంచి స్థితి నుంచి చకచకా వికెట్లు కోల్పోయి కుప్పకూలడం జట్టును ఇంకాస్త కలవరపెట్టింది.
వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దు కాకపోయి ఉంటే భారత్ గెలిచేదంటూ ధీమాగా చెప్పలేని పరిస్థితి. ప్రపంచకప్ ముంగిట పాక్ చేతిలో ఓడితే ఆత్మవిశ్వాసం ఎంతగా దెబ్బ తినేదో ఇట్టే చెప్పేయచ్చు. మ్యాచ్ సాగినంత వరకు అయితే భారత్ ప్రదర్శన ఆశాజనకంగా లేని మాట వాస్తవమే. అయితే ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని గాడిన పడకపోతే ఇక ప్రపంచకప్‌లో భారత్‌కు కష్టమే.
Ind vs Pak Asia Cup 2023 : ఆదుకున్న ఇషాన్, హార్దిక్.. ఇక భారమంతా బౌలర్లమీదే
Ind Vs Pak Asia Cup 2023 : షహీన్, హారిస్ బౌలింగ్ మెరుపులు .. రోహిత్, విరాట్ క్లీన్‌బౌల్డ్