ETV Bharat / sports

IND VS NZ: విజృంభించిన భారత బౌలర్లు.. 108కే కుప్పకూలిన కివీస్​ - teamindia vs newzealand shami wickets

రెండో వన్డేలో టీమ్​ ఇండియాకు స్వల్ప లక్ష్యం నిర్దేశించింది న్యూజిలాండ్​. ఆ మ్యాచ్ వివరాలు..

First innings teamindia target
విజృంభించిన భారత బౌలర్లు.. టీమ్​ఇండియా ముందు స్వల్ప లక్ష్యం
author img

By

Published : Jan 21, 2023, 4:13 PM IST

Updated : Jan 21, 2023, 4:41 PM IST

రెండో వన్డేలో టీమ్​ ఇండియా బౌలర్ల విజృంభించారు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. ఏ దశలోనూ వారిని కోలుకోనివ్వకుండా దెబ్బతీశారు. దీంతో కివీస్​ జట్టు 34.3 ఓవర్లలోనే 108 పరుగులకు కుప్పకూలింది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్​లో మహ్మద్‌ షమీ (3/18), మహ్మద్‌ సిరాజ్‌ (1/10), శార్దూల్‌ ఠాకూర్‌ (1/26), హార్దిక్​ పాండ్యా (2/16), కుల్దీప్‌ యాదవ్‌ (1/29), వాషింగ్టన్‌ సుందర్‌ (2/7) చెలరేగడంతో 34.3 ఓవర్లలోనే కివీస్‌ జట్టు ఆలౌట్‌ అయింది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్​లో మొదట 14 ఓవర్లలో 18 పరుగులకే ఐదు వికెట్లు పడిపోయాయి. గ్లెన్‌ ఫిలిప్స్‌ (36), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (22), మిచెల్‌ సాంట్నర్‌ (27) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. తొలి వన్డే సెంచరీ హీరో బ్రాస్‌ వెల్‌ ఈ మ్యాచ్‌లోనూ రాణిస్తాడనుకున్నప్పటికీ.. అతడిని షమీ బోల్తా కొట్టించాడు.

ఫిన్‌ అలెన్‌ (0), డెవాన్‌ కాన్వే (7), హెన్రీ నికోల్స్‌ (2), డారిల్‌ మిచెల్‌ (1), టామ్‌ లాథమ్‌ (1), ఫెర్గూసన్‌ (1), బ్లెయిర్‌ టిక్నర్‌ (2) విఫలమయ్యారు. భారత బౌలర్లలో షమీ 3, సుందర్​, హార్దిక్ తలో రెండు, సిరాజ్​, ఠాకూర్​, కుల్దీప్​ తలో వికెట్ తీశారు.

ఇదీ చూడండి: IND vs NZ: రోహిత్​కు వింత అనుభవం.. పీకల్లోతు కష్టాల్లో కివీస్

Last Updated : Jan 21, 2023, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.