ETV Bharat / sports

Ind vs Eng: ఐదో రోజు సాగని ఆట.. తొలి టెస్టు డ్రా - ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్ అప్డేట్లు

నాటింగ్​హామ్ వేదికగా భారత్​-ఇంగ్లాండ్​ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. వర్షం వల్ల ఐదో రోజు ఆటలో ఒక్క బంతి పడలేదు. దీంతో మ్యాచ్​ను ముగిస్తున్నట్లు ఫీల్డ్​ అంపైర్లు ప్రకటించారు.

india vs england
ఇండియా vs ఇంగ్లాండ్
author img

By

Published : Aug 8, 2021, 8:39 PM IST

Updated : Aug 8, 2021, 10:11 PM IST

వర్షం కారణంగా నాటింగ్​హామ్ టెస్టు డ్రాగా ముగిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వాన వల్ల ఐదో రోజు ఒక్క బంతి పడలేదు. దీంతో మ్యాచ్​ను ముగిస్తున్నట్లు ఫీల్డ్​ అంపైర్లు ప్రకటించారు.

విజయానికి 157 పరుగుల దూరంలో ఉన్న టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్​లో ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. చివరి రోజు ఆట జరిగితే గెలుపు లాంఛనమేనని భావించిన కోహ్లీ సేనకు వరుణుడి రూపంలో భంగపాటు ఎదురైంది.

ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 183 పరుగులకు ఆలౌట్​ కాగా.. ప్రతిగా భారత్​ 278 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​.. 303 పరుగులు చేసి.. టీమ్​ఇండియా ముందు 209 పరుగుల లక్ష్యం ఉంచింది.

ఆకట్టుకున్న రాహుల్​..

Ind vs Eng: first test Match abandoned due to rain
రాహుల్​- జడేజా అభివాదం

ఈ మ్యాచ్​లో ఓపెనర్​గా జట్టులో చోటు దక్కించుకున్న కేఎల్​ రాహుల్​ తొలి ఇన్నింగ్స్​లో సత్తా చాటాడు. 214 బంతుల్లో 84 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్​లో 26 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు. జట్టులో టాప్​ స్కోరర్​గా నిలిచాడు. సుదీర్ఘ ఫార్మాట్​కు చాలాకాలం దూరంగా ఉన్న అతడు రిజర్వ్​ బెంచ్​కే పరిమితమయ్యాడు. శుభ్​మన్​ గిల్​, మయాంక్ అగర్వాల్​ గాయాల కారణంగా దూరం కావడం రాహుల్​కు కలిసొచ్చింది. చివరిసారిగా 2018లో ఇంగ్లాండ్​పై శతకం చేసిన అతడు ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్​ ఆడలేదు.

బుమ్​ బుమ్​ బుమ్రా..

జస్ప్రీత్ బుమ్రా

డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్​పై ఘోరంగా విఫలమైన బుమ్రా.. ఇంగ్లాండ్​తో తొలి టెస్టులో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్​లో 46 పరుగులకే 4 వికెట్లు తీసిన జస్ప్రీత్​.. రెండో ఇన్నింగ్స్​లో 5 వికెట్లతో మెరిశాడు. దీంతో తక్కువ కాలంలోనే అతని బౌలింగ్​లో చాలా మార్పు వచ్చిందని అభిమానులు బుమ్రాను మెచ్చుకుంటున్నారు.

ఇదీ చదవండి: అందువల్లే నా ఆటలో మార్పు: బుమ్రా

జడేజా అర్ధ శతకం..

జడేజా

తొలి ఇన్నింగ్స్​లో కెప్టెన్​ కోహ్లీ, వైస్​ కెప్టెన్ రహానె, వన్​డౌన్​ బ్యాట్స్​మన్​ పుజారా విఫలమైన చోట ఆల్​రౌండర్​ జడేజా తన మార్క్​ చూపించాడు. బంతితో వికెట్లేమీ తీయకున్నా.. బ్యాట్​తో సత్తా చాటాడు. అద్భుత హాఫ్ సెంచరీతో టీమ్ఇండియా ఆధిక్యం సంపాదించడానికి దోహదపడ్డాడు.

52 టెస్టుల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా జడేజా ఫీట్​ సాధించాడు. ఈ జాబితాలో ఇయాన్​ బోథమ్​ తొలి స్థానంలో ఉన్నాడు. ఇయాన్ కేవలం 42 టెస్టుల్లోనే ఈ ఘనత వహించాడు. ఆ తర్వాతి స్థానాల్లో కపిల్​ దేవ్​(50), ఇమ్రాన్​ ఖాన్(50), అశ్విన్​(51) ఉన్నారు.

రూట్​ సెంచరీ..

జో రూట్​

తొలి ఇన్నింగ్స్​లో 183 పరుగులకే ఆలౌటైన ఇంగ్లాండ్​, రెండో ఇన్నింగ్స్​లో 303 పరుగులు చేసింది. ఈ రెండింటిలో ఆతిథ్య జట్టుకు అండగా నిలిచింది కెప్టెన్​ జో రూట్​. ఓ హాఫ్ సెంచరీ, సెంచరీ సాయంతో మొత్తంగా 173 రన్స్​ సాధించాడు. రూట్​ ఈ మాత్రమైన ఆడకుంటే ఇంగ్లాండ్​ ఇంకాస్త తక్కువ పరుగులు చేసేది. ఆట ఫలితం నాలుగో రోజే తేలిపోయేది.

అండర్సన్​ అదుర్స్​..

అండర్సన్

ఇంగ్లాండ్​ సీనియర్​ బౌలర్​ జేమ్స్​ అండర్సన్​ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్​గా నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ బౌలర్​ అనిల్​ కుంబ్లేను (619 వికెట్లు) అధిగమించాడు. కేఎల్ రాహుల్​ వికెట్ తీసి జిమ్మీ ఈ ఘనత సాధించాడు. ఈ ఫీట్​ చేరుకోవడానికి అతడికి 163 టెస్టులు అవసరమయ్యాయి. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్నర్​ ముత్తయ్య మురళీధరన్​ (800 వికెట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. ఆసీస్​ దిగ్గజ బౌలర్​ షేన్ వార్న్​ (708 వికెట్లు) తర్వాత స్థానంలో ఉన్నాడు.

రాబిన్సన్​ 'ఐదు'..

రాబిన్సన్​

కెరీర్​లో రెండో టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్ యువ బౌలర్​ రాబిన్సన్​.. ఇండియాపై తొలి టెస్టులో 5 వికెట్లతో రాణించాడు. కివీస్​పై ఆడిన తొలి టెస్టులోనే 7 వికెట్లు తీసిన రాబిన్సన్​.. ఆ తర్వాత జాతి వివక్ష వ్యాఖ్యలతో జట్టుకు దూరమయ్యాడు. తర్వాత అతడిపై కనికరం చూపింది ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు. తిరిగి భారత్​తో ఐదు టెస్టుల సిరీస్​కు ఎంపిక చేసింది.

ఇదీ చదవండి: ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్​' రేసులో వీరే..

Last Updated : Aug 8, 2021, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.