Ind vs Aus ODI 2023 : 2023 ఆసియా కప్ నెగ్గిన జోష్‌లో టీమ్ఇండియా.. అస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. శుక్రవారం మొహాలి వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లో టీమ్ఇండియా.. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలోని మేటి జట్లలో ఒకటైన ఆసీస్‌ను.. స్టార్ ప్లేయర్ల గైర్హాజరీలో భారత్ ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
భారత్‌కు కీలకం.. బ్యాటింగ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ టాపార్డర్ బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. మిడిల్లో అయ్యర్, తిలక్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆడే ఛాన్స్ ఉంది. ఇక ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. అలాగే చాలా రోజుల తర్వాత వన్డే ఆడనున్న రవిచంద్రన్ అశ్విన్‌పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. బౌలింగ్‌లో మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా రాణిస్తే.. ఆసీస్‌ను కట్టడి చేయవచ్చు.
మరోవైపు ఆసీస్.. రీసెంట్గా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో 3 టీ20, 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. ఇందులో టీ20 సిరీస్‌ను ఆసీస్ (3-0) క్లీన్‌స్వీప్ చేయగా.. వన్డే సిరీస్‌లో 2-3 తో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న ఆసీస్ ఏకంగా రెండు స్థానాలు దిగజారి మూడో ప్లేస్‌కు పడిపోయింది.
వాళ్లు ఔట్.. సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ తగిలింది. భారత్‌తో తొలి మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, పేసర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా దూరమయ్యారు. వీరి స్థానంలో బ్యాటర్ స్టీవ్ స్మిత్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కొంత కాలం బ్రేక్ తర్వాత మళ్లీ జట్టు పగ్గాలు చేతపట్టనున్నాడు. ఇక సౌతాఫ్రికా సిరీస్‌లో రాణించిన బ్యాటర్ లబుషేన్, స్పిన్నర్ ఆడమ్ జంపాపై, కమిన్స్ ఆశలు పెట్టుకున్నాడు.
భారత్-ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్..
ఇరుజట్ల ముఖాముఖి పోటీల్లో గణాంకాలు చూస్తే.. భారత్‌పై ఆసీస్‌దే పైచేయి. భారత్-ఆస్ట్రేలియా వన్డేల్లో ఇప్పటివరకూ 146 సార్లు తలపడగా.. ఆసీస్ 82 నెగ్గింది. 54 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. పదింట్లో ఫలితం తేలలేదు.
భారత్ తుది జట్టు (అంచనా) : కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్/తిలక్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, సిరాజ్, షమీ/శార్దూల్
ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా) : డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మర్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిన్స్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీమ్ అబాట్, జోష్ హజెల్‌వుడ్, అడమ్ జంపా.
-
Coming 🆙 next 👉 #INDvAUS
— BCCI (@BCCI) September 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Here are the #TeamIndia squads for the IDFC First Bank three-match ODI series against Australia 🙌 pic.twitter.com/Jl7bLEz2tK
">Coming 🆙 next 👉 #INDvAUS
— BCCI (@BCCI) September 18, 2023
Here are the #TeamIndia squads for the IDFC First Bank three-match ODI series against Australia 🙌 pic.twitter.com/Jl7bLEz2tKComing 🆙 next 👉 #INDvAUS
— BCCI (@BCCI) September 18, 2023
Here are the #TeamIndia squads for the IDFC First Bank three-match ODI series against Australia 🙌 pic.twitter.com/Jl7bLEz2tK
-
Next stop India! ✈️
— Cricket Australia (@CricketAus) September 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The squad is in for our Aussie men's final three-match series before the ODI World Cup 🏆 #CWC23 pic.twitter.com/J7wvZ2WyRc
">Next stop India! ✈️
— Cricket Australia (@CricketAus) September 17, 2023
The squad is in for our Aussie men's final three-match series before the ODI World Cup 🏆 #CWC23 pic.twitter.com/J7wvZ2WyRcNext stop India! ✈️
— Cricket Australia (@CricketAus) September 17, 2023
The squad is in for our Aussie men's final three-match series before the ODI World Cup 🏆 #CWC23 pic.twitter.com/J7wvZ2WyRc
Ind vs Aus ODI 2023 : ఆసీస్‌తో మ్యాచ్‌కు అంతా రెడీ.. ఈ సిరీస్ వారికి అగ్ని పరీక్ష!
Hardik ODI World Cup : హార్దిక్.. ఇలాగే రెచ్చిపో.. ఎక్కడా తగ్గకు విజయం మనదే!