Ind vs Afg World Cup 2023 : కోట్లాది అభిమానుల అంచనాలను మోస్తూ.. ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది భారత్. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ కొంత ఇబ్బందిపడ్డా.. చివరికి విజయం సాధించింది. ఇక ఈ జోష్‌లో టీమ్ఇండియా.. టోర్నీలో రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 11 బుధవారం అఫ్గానిస్థాన్‌తో, భారత్ తలపడనుంది. అయితే అఫ్గాన్‌తో పోరు తర్వాత.. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాకు ప్రస్తుత మ్యాచ్.. శనివారం నాటి మహా సమరానికి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వారు ఛాన్స్‌ను వినియోగించుకుంటారా? టీమ్ఇండియా యంగ్ సంచలనం శుభ్‌మన్ గిల్ జట్టుకు దూరం కావడం వల్ల.. అతడి స్థానంలో ఇషాన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. అయితే ఆసీస్‌తో మ్యాచ్‌లో ఇషాన్.. ఎదుర్కున్న తొలి బంతినే ఎటాకింగ్ మోడ్‌లో ఆడబోయి సెకండ్ స్లిప్‌లో దొరికిపోయాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే ఇషాన్ పెవిలియన్ చేరి.. తీవ్రంగా నిరాశపర్చాడు. ఇక రీసెంట్గా ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన శ్రేయస్ అయ్యర్.. తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే వీరిద్దరూ. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో అయినా.. మంచి ఇన్నింగ్స్‌తో రాణించాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
రోహిత్ గాడిన పడేనా.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలి మ్యాచ్‌లో సున్నా చుట్టేశాడు. పసికూన అఫ్గాన్‌పై అయినా.. బ్యాట్ ఝళిపించి భారీ స్కోర్ చేసి, పాక్‌తో మ్యాచ్‌కు ముందు టచ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది.
జట్టు ఎలా ఉండనుందో? దిల్లీ పిచ్ కూడా స్పిన్నర్లకే అనుకూలం. దీంతో జడేజా, కుల్దీప్ ఎలాగు జట్టులో ఉంటారు. అయితే మూడో స్పిన్నర్‌గా అశ్విన్‌ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేకపోతే, బుమ్రా, సిరాజ్‌లతో.. షమి, శార్దూల్ ఎవరో ఒకరు బౌలింగ్ చేయవచ్చు.
పసికూనల్ని తీసిపడేయలేం.. అఫ్గాన్.. చిన్న జట్టే అయినా మరీ తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా రషీద్ ఖాన్ సత్తా ఏంటో టీమ్ఇండియా ప్లేయర్లకు తెలిసిందే. ఇక బ్యాటింగ్‌లో గుర్బాజ్ ఎలాంటి రికార్డులు సాధిస్తున్నాడో తెలిసిందే. ఇబ్రహీం జాద్రాన్ ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. నబి లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్ సేవలూ అఫ్గాన్‌కు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అఫ్గాన్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే.
-
𝐖𝐞 𝐌𝐞𝐞𝐭 𝐈𝐧𝐝𝐢𝐚 𝐓𝐨𝐦𝐨𝐫𝐫𝐨𝐰! 🤩
— Afghanistan Cricket Board (@ACBofficials) October 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
AfghanAtalan will be in action against @BCCI in their 2nd match at the ICC Men's Cricket World Cup 2023 tomorrow at the Arun Jaitley Stadium in Delhi. 👍#AfghanAtalan | #CWC23 | #AFGvIND | #WarzaMaidanGata pic.twitter.com/5YQxSGoMxD
">𝐖𝐞 𝐌𝐞𝐞𝐭 𝐈𝐧𝐝𝐢𝐚 𝐓𝐨𝐦𝐨𝐫𝐫𝐨𝐰! 🤩
— Afghanistan Cricket Board (@ACBofficials) October 10, 2023
AfghanAtalan will be in action against @BCCI in their 2nd match at the ICC Men's Cricket World Cup 2023 tomorrow at the Arun Jaitley Stadium in Delhi. 👍#AfghanAtalan | #CWC23 | #AFGvIND | #WarzaMaidanGata pic.twitter.com/5YQxSGoMxD𝐖𝐞 𝐌𝐞𝐞𝐭 𝐈𝐧𝐝𝐢𝐚 𝐓𝐨𝐦𝐨𝐫𝐫𝐨𝐰! 🤩
— Afghanistan Cricket Board (@ACBofficials) October 10, 2023
AfghanAtalan will be in action against @BCCI in their 2nd match at the ICC Men's Cricket World Cup 2023 tomorrow at the Arun Jaitley Stadium in Delhi. 👍#AfghanAtalan | #CWC23 | #AFGvIND | #WarzaMaidanGata pic.twitter.com/5YQxSGoMxD
ODI World Cup 2023 : చరిత్ర సృష్టించిన కుశాల్ మెండిస్.. పాకిస్థాన్‌పై ఫాసెస్ట్ సెంచరీ