సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి.. తొలిసారి విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ వేటకు సిద్ధమైంది. ఆదివారం గ్రూప్- బి పోరులో పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో టోర్నీని ఆరంభించనుంది. సాధారణంగా భారత్, పాక్ మ్యాచ్ అంటేనే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతాయి. ఇక ప్రపంచకప్‌లో అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కీలక సమరంలో భారత్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కానీ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వేలి గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమవడం జట్టుకు దెబ్బే. దీంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, జెమీమా బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. హర్మన్ కూడా భుజం గాయం నుంచి కోలుకుంది. సారథిగా దేశానికి అండర్-19 ప్రపంచకప్ అందించిన షెఫాలి వర్మ.. ఇప్పుడు ఓపెనర్‌గా సత్తాచాటాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో చెలరేగిన రిచా ఘోష్, జెమీమా ఫామ్ కొనసాగించాలి. బౌలింగ్ విభాగం మాత్రం కలవరపెడుతోంది.
పేసర్ రేణుక సింగ్ ప్రదర్శన మాత్రమే ఆశాజకనంగా ఉంది. ఏడాదికి పైగా విరామం తర్వాత జట్టులోకి వచ్చిన వెటరన్ పేసర్ శిఖా పాండేతో ఏపీ అమ్మాయి అంజలి శర్వాణి, పుజా వస్త్రాకర్.. సఫారీ పిచ్‌లపై ఎలా ఫాస్ట్‌బౌలింగ్ చేస్తారన్నది ఆసక్తికరం. మరోవైపు నిరుడు ఆసియా కప్‌లో భారత్‌పై గెలిచిన పాకిస్థాన్‌ను మరీ తేలిగ్గా తీసుకుంటే ప్రమాదమే. ఈ మెగా టోర్నీకి ముందు దక్షిణాఫ్రికాలో ముక్కోణపు సిరీస్ ఫైనల్లో ఓటమి, వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి కూడా భారత్‌కు ప్రతికూలాంశాలే.
4:
ఇప్పటివరకూ టీ20 ప్రపంచకప్‌ల్లో పాకిస్థాన్‌తో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో భారత్ విజయాలు. రెండింట్లో పాక్ గెలిచింది. మొత్తంగా టీ20ల్లో రెండు జట్లు 13 సార్లు తలపడగా.. భారత్ 10, పాక్ 3 మ్యాచ్‌ల్లో నెగ్గాయి.