ETV Bharat / sports

ICC T20 Rankings: అదే స్థానంలో బాబర్.. కోహ్లీ, రాహుల్ డౌన్

author img

By

Published : Oct 27, 2021, 3:32 PM IST

Updated : Oct 27, 2021, 4:26 PM IST

ఐసీసీ బుధవారం(అక్టోబర్​ 27) టీ20 ర్యాంకింగ్స్​ను(ICC T20 Rankings 2021) విడుదల చేసింది. టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ, ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ తమ ర్యాంకుల్లో కిందకి పడిపోయారు. కాగా, దక్షిణాఫ్రికా బ్యాటర్ మర్​క్రమ్​, పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్​ రిజ్వాన్​ కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్​ను దక్కించుకున్నారు.

babar, kohli, rahul
బాబర్, కోహ్లీ, రాహుల్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్​ బుధవారం(అక్టోబర్​ 27) టీ20 ర్యాంకింగ్స్​ను(ICC T20 Rankings 2021) ప్రకటించింది. ఇందులో టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli News) మరో ర్యాంకు కిందకు పడిపోయి ఐదో స్థానంలో నిలవగా.. ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ కూడా రెండు స్థానాలు దిగజారి 8వ ర్యాంకులో ఉన్నాడు.

దక్షిణాఫ్రికా బ్యాటర్ మర్​క్రమ్​, పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్​ రిజ్వాన్​ కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్​ను దక్కించుకున్నారు. టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఇటీవలే ఆస్ట్రేలియా, వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​ల్లో మంచి ప్రదర్శన చేసిన మర్​క్రమ్​ 8 మందిని వెనక్కి నెట్టి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా, టీమ్​ఇండియా, న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​ల్లో బాగా ఆడి నాలుగో స్థానంలో నిలిచాడు​ రిజ్వాన్​.

ఇంగ్లాండ్ ఆటగాడు డెవిడ్ మలన్(831 పాయింట్లు), పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్(820)(Babar Azam ICC Ranking T20) పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

బౌలర్లలో..

టీ20 ప్రపంచకప్​లో భాగంగా టీమ్​ఇండియాపై అద్భుతంగా ఆడిన షహీన్ అఫ్రిది 11 స్థానాలను ఎగబాకి 12వ ర్యాంకుకు చేరుకున్నాడు. మరో పాక్​ ఆటగాడు హ్యారిస్​ రౌఫ్ కెరీర్​ బెస్ట్ 17వ స్థానం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ షమ్సీ(750 పాయింట్లతో) మొదటి స్థానంలో ఉన్నాడు. ఆల్​రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్​ ఆటగాడు షకిబ్ అల్ హసన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదీ చదవండి:

IND vs PAK: పాక్​ మాజీ క్రికెటర్-హర్భజన్​ మధ్య మాటల యుద్ధం

Last Updated : Oct 27, 2021, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.