ETV Bharat / sports

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల.. దూసుకొచ్చిన శ్రేయస్​ అయ్యర్​, గిల్​

author img

By

Published : Nov 30, 2022, 8:21 PM IST

టీమ్‌ఇండియా యంగ్ ప్లేయర్స్​ శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌ మరో ఘనత సాధించారు. వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ బ్యాటర్లు తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు.

icc odi rankings shreyas iyer
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల.. దూసుకొచ్చిన శ్రేయస్​ అయ్యర్​, గిల్​

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శనకు గాను టీమ్‌ఇండియా యంగ్ ప్లేయర్స్​ శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌ మరో ఘనతను అందుకున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ బ్యాటర్లు తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. 129 పరుగులు సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌.. 6 స్థానాలు దాటుకొని 27వ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. 108 పరుగులు చేసి 3 స్థానాలు ఎగబాకిన శుభ్‌మన్‌ గిల్‌ 34వ ర్యాంక్‌లో నిలిచాడు. 0-1తో ఈ సిరీస్‌ను న్యూజిలాండ్‌ జట్టు సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే.

అయితే, కివీస్‌తో మ్యాచ్‌లో అర్ధశతకం సాధించినప్పటికీ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ రెండు స్థానాలు కిందకు పడిపోయాడు. ఈ సిరీస్‌కు దూరంగా ఉన్న విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఒక్కో స్థానం కిందకు దిగి 8, 9 ర్యాంకుల్లో నిలిచారు. న్యూజిలాండ్‌ బ్యాటర్లు టామ్‌ లాథమ్‌, కేన్‌ విలియమ్సన్‌ సైతం ఒక స్థానం పురోగతిని సాధించారు. తొలి వన్డేలో ఆ జట్టు 300 పరుగుల లక్ష్యాన్ని అధిగమించడంలో లాథమ్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కేన్‌ సైతం టాప్‌ 10 స్థానంలో చేరాడు.

ఇదీ చూడండి: అంతుచిక్కని వైరస్​ సోకి ఇంగ్లాండ్​ క్రికెటర్లు అస్వస్థత.. పాక్​తో తొలి టెస్ట్​ డౌటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.