Harmanpreet Kaur Fine : టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు షాక్ తగిలింది. తాజాగదా ఆమె చేసిన ఓ పనికి మ్యాచ్ నిర్వాహకులు ఫీజులో 75 శాతం కోత విధించారు. ఈ క్రమంలో ఫైన్‌తో పాటు ఆమెకు మూడు డిమెరిట్ పాయింట్లు వచ్చాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో తన ఔట్ పట్ల అంపైర్లపై అసహనం వ్యక్తం చేస్తూ.. స్టంప్స్‌ను బలంగా కొట్టినందుకు 50 శాతంతో పాటు రెండు పాయింట్లు ఫైన్‌గా నిర్వాహకులు విధించారు. కాగా మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సమయంలో.. బంగ్లా కెప్టెన్‌తో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు గాను అదనంగా 25 శాతంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ ఫైన్ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
అసలేం జరిగింది?
భారత్ - బంగ్లాదేశ్ మధ్య మూడో మ్యాచ్‌లో హర్మన్ 33.4 వద్ద ఎల్బిడబ్ల్యూగా పెలిలియన్ చేరింది. అయితే బంగ్లా బౌలర్ నహిద అక్తర్ వేసిన టాస్ బంతిని హర్మన్ స్వీప్ చేయబోయింది. ఈ క్రమంలో బంతి బ్యాట్ అంచున ముద్దాడి.. ఆమె లెగ్ ప్యాడ్స్‌కు తగిలింది. దీంతో బంగ్లా బౌలర్లు అప్పీల్ చేయకముందే.. ఫీల్డ్ అంపైర్ హర్మన్‌ను ఔట్‌గా ప్రకటించారు.
అంతే తాను ఔట్ కాదంటూ.. హర్మన్ పట్టరాని కోపంతో స్టంప్స్‌ను బలంగా కొట్టి, అంపైర్ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేసింది. అక్కడితో ఆగకుండా మ్యాచ్ ప్రజెంటేషన్ సమయంలో అంపైర్లను ఉద్దేశించి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది హర్మన్. ఇరుజట్ల కెప్టెన్లు ట్రోఫీ అందుకునే సమయంలో హర్మన్.. బంగ్లా ప్లేయర్లతో 'మీతో పాటు అంపైర్లను తెచ్చుకోండి' అంటూ బాంబ్ పేల్చింది. అంతే.. అంపైర్లను కూడా బంగ్లాదేశ్ జట్టులోని సభ్యులుగా భావించడం మరో తప్పిదంగా భావిస్తూ మ్యాచ్ రిఫరీ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
-
Frustrated Harmanpreet Kaur hits the stumps with her bat, few angry words to the umpire before walking off. #CricketTwitter #BANvIND pic.twitter.com/uOoBgS9g44
— Female Cricket (@imfemalecricket) July 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Frustrated Harmanpreet Kaur hits the stumps with her bat, few angry words to the umpire before walking off. #CricketTwitter #BANvIND pic.twitter.com/uOoBgS9g44
— Female Cricket (@imfemalecricket) July 22, 2023Frustrated Harmanpreet Kaur hits the stumps with her bat, few angry words to the umpire before walking off. #CricketTwitter #BANvIND pic.twitter.com/uOoBgS9g44
— Female Cricket (@imfemalecricket) July 22, 2023
కెప్టెన్‌కు మద్దతుగా స్మృతి...
ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ హర్మన్‌కు, వైస్ కెప్టెన్ స్మృతి మద్దతుగా నిలిచారు. తన ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాదని అభిప్రాయపడింది. "హర్మన్ ఔట్ పట్ల అంపైర్లు ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. బంతి బ్యాట్‌కు స్పష్టంగా తగిలింది. కానీ ఈ సిరీస్‌లో రివ్యూలు లేవు. మేము విజయానికి ఒక్క పరుగు దూరంలోనే ఆగిపోయాం. ఈ వివాదస్పద ఔట్ పట్ల ఐసీసీ, బీసీసీఐ, బీసీబీ చర్యలు తీసుకుంటాయని అనుకుంటున్నాను" అని స్మృతి తెలిపింది.