ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్​లో ఫినిషర్​గా హార్దిక్..' - team india squad for world cup 2021

టీ 20 ప్రపంచకప్(T20 World Cup 2021) త్వరలోనే ప్రారంభంకానున్న వేళ.. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya News) బౌలింగ్​ ఫామ్​పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాండ్యను.. ఎంఎస్ ధోనీ మాదిరిగా ఫినిషర్​గా పంపాలని జట్టు భావిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.

hardik pandya
హార్దిక్ పాండ్య
author img

By

Published : Oct 14, 2021, 1:00 PM IST

టీ20 ప్రపంచకప్​(T20 World Cup 2021) సమీపిస్తున్న వేళ.. టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యను(Hardik Pandya News) ఫినిషర్​గా ఆడించాలని జట్టు మేనేజ్​మెంట్​ భావిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత కొన్ని రోజులుగా పాండ్య ఫామ్​ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. బౌలింగ్​లో పూర్తిగా రాణించలేకపోయినా.. ఛేజింగ్​లో ఒత్తిడిని తట్టుకుని టీమ్​ను గెలిపించే సామర్థ్యం హార్దిక్​కు(Hardik pandya News Today) ఉందని అభిప్రాయపడ్డాయి.

"బౌలింగ్​లో హార్దిక్ 100 శాతం ప్రతిభ కనబరచలేకపోతున్నాడు. ఈ కారణంగానే టీ20 ప్రపంచకప్​లో పాండ్యను ఫినిషర్​​ బ్యాట్స్​మన్​గా పంపాలని టీమ్​ఇండియా మేనేజ్​మెంట్ భావిస్తోంది. గతంలో ఎంఎస్​ ధోనీ ఆడిన విధంగానే.. పాండ్య ఫినిషర్​ రోల్​ తీసుకుంటాడు" అని అధికార వర్గాలు వెల్లడించాయి. బౌలింగ్ మెరుగుపరుచుకునేందుకు హార్దిక్ పూర్తి స్థాయిలో కృషి చేస్తాడని ధీమా వ్యక్తం చేశాయి.

మరోవైపు టీ20 ప్రపంచకప్​ టీమ్​ఇండియా స్క్వాడ్​లో(Team India Squad for T20 World Cup) కొన్ని మార్పులు చేసింది బీసీసీఐ. అక్షర్​ పటేల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్​ను ఎంపిక చేసినట్లు పేర్కొంది. యువ ఆటగాళ్లు ఆవేశ్​ ఖాన్​, ఉమ్రాన్​ మాలిక్​, హర్షల్​ పటేల్​, లక్మన్​ మేరివాలా, వెంకటేశ్​ అయ్యర్​, కరన్ శర్మ, షాబాజ్​ అహ్మద్​, కృష్ణప్ప గౌతమ్​.. టీ20 ప్రపంచకప్​లో భారత జట్టుకు తమ సేవల్ని అందించనున్నారని స్పష్టం చేసింది. ఇందుకోసం వారంతా యూఏఈలో ఉన్న టీమ్ఇండియా శిబిరంలో చేరనున్నారు.

ఇదీ చదవండి:

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​లతో టీమ్​ఇండియా వార్మప్ మ్యాచ్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.