ETV Bharat / sports

రూట్​ సెంచరీలు​- బిగ్​బీ ట్వీట్​ వైరల్​

2016లో ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​ను ఉద్దేశిస్తూ బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం​ ట్రోల్​ అవుతోంది. బిగ్​బీ ఆ ట్వీట్​ను డిలీట్​ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్​ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

root
రూట్​
author img

By

Published : Aug 27, 2021, 3:18 PM IST

Updated : Aug 27, 2021, 3:30 PM IST

లీడ్స్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో పేలవ ప్రదర్శనతో టీమ్ఇండియా 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లీష్​ జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 423 పరుగులు చేసింది. ఫలితంగా ప్రత్యర్థి జట్టు 345 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​ 2016లో చేసిన ఓ ట్వీట్​ ఇప్పుడు వైరల్​గా మారింది. ఆ ట్వీట్​ను డిలీట్​ చేయమని అభిమానులు అమితాబ్​ను డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ జరిగింది

2016 టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరింది. ఆరోజు విరాట్‌ కోహ్లీ (82*; 51 బంతుల్లో 9x4, 2x6) మంచి ఇన్నింగ్స్‌ ఆడి మ్యాచ్‌ను గెలిపించాడు. దాంతో ఫ్లింటాఫ్‌.. కోహ్లీ బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. "అతడు ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు జో రూట్‌లా అద్భుతమైన ఆటగాడిగా మారుతాడు. ఫైనల్​లో ఇంగ్లాండ్​ ఎవరితో తలపడుతుందో." అని ట్వీట్‌ చేశాడు. దానికి స్పందించిన అమితాబ్‌ "రూట్‌ ఎవరు?నాకు తెలియదు. అయినా టీమ్ఇండియా అతడిని కూకటివేళ్లతో పెకిలిస్తుంది" అని బదులిచ్చారు.

big g
బిగ్​బీ ట్వీట్​

అయితే కొంతకాలంగా రూట్​ సెంచరీలతో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. 2021లో 1350కుపైగా పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్​ సిరీస్​లోనూ ఇప్పటికే మూడు శతకాలు బాదాదు. ఈ సిరీస్​ పూర్తయ్యేలోగా 500కు పైగా పరుగులు చేస్తాడని క్రీడావిశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కొంతకాలంగా కెప్టెన్​ కోహ్లీ అంచనాలకు తగ్గట్లుగా ఆడలేకపోతున్నాడు. రెండేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఈ నేపథ్యంలోనే బిగ్​బీ చేసిన సదరు ట్వీట్​ను తొలగించాలంటూ నెటిజన్లు డిమాండ్​ చేస్తున్నారు.

ఫ్లింటాప్​ చురక

టీమ్‌ఇండియాపై తన వందో టెస్టులో రూట్​ ద్విశతకం సాధించిన సందర్భంలోనూ ఫ్లింటాప్​ తాను చేసిన ఆ పాత ట్వీట్‌ను వెలికి తీశాడు. అమితాబ్‌ పోస్టును రీట్వీట్‌ చేస్తూ "మీ మీద ఎంతో గౌరవం ఉంది. కానీ, ఈ ట్వీట్‌ ఇన్నేళ్ల తర్వాత పనికొచ్చింది" అని పేర్కొంటూ బిగ్​బీకి చురకంటించాడు.

​ఇదీ చూడండి: లార్డ్స్​ మైదానంలో కోహ్లీ, రూట్ తీవ్ర వాగ్వాదం

Last Updated : Aug 27, 2021, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.