ETV Bharat / sports

INDvsENG: మూడో టెస్టు కోసం పటిష్ట వ్యూహాలతో ఇరుజట్లు!

భారత్‌-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు బుధవారం నుంచి జరగనుంది. షమీ-బుమ్రా బ్యాటింగ్, బౌలర్ల సమష్టి ప్రదర్శనతో రెండో టెస్టులో ఘన విజయం సాధించిన కోహ్లీసేన.. అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. జట్టు కూర్పులో మార్పులు చేయకుండానే భారత్ బరిలోకి దిగబోతుంది. అటు బ్యాట్స్‌మెన్ వైఫల్యం, గాయాలతో సతమత మవుతున్న ఇంగ్లాండ్‌.. పలు మార్పులతో బరిలోకి దిగనుంది.

మూడో టెస్టు
మూడో టెస్టు
author img

By

Published : Aug 25, 2021, 5:32 AM IST

భారత్‌-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. లీడ్స్ వేదికగా మూడో టెస్టు నేడు (ఆగస్టు 25) ప్రారంభం కానుంది. తొలి టెస్టులో చేతికి వచ్చిన విజయాన్ని వరుణుడు ఆపినా.. అత్యుత్తమ ఆటతో రెండో టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ ఆదే జోరు కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ ఫామ్‌లో ఉండడం భారత్​కు కలిసొచ్చే అంశం. వీరిద్దరూ శుభారంభం అందిస్తూ.. ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతున్నారు. కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డ చెతేశ్వర్ పుజారా, రహానేలు రాణించడం పట్ల జట్టు సంతోషంగా ఉంది. మూడో టెస్టులోనూ వీరు రాణిస్తే తిరుగుండదని భావిస్తోంది.

ఇక.. కొద్దిరోజులుగా తన మార్కు ఆట కనబరచని కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. చివరగా 2019 నవంబర్‌లో శతకం సాధించిన కోహ్లీ.. ఆఫ్ సైడ్ వేసే బంతులకు కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఎక్కువ సార్లు ఔటవుతున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా ఆ బలహీనతను.. అధిగమించి మూడంకెల స్కోరు అందుకోవాలని భారత్ కోరుకుంటోంది.

బౌలింగ్ దుర్భేద్యం..

రిషభ్ పంత్, రవీంద్ర జడేజా కూడా మరింత జోరు పెంచాల్సి ఉంది. మూడో టెస్టు జరగనున్న లీడ్స్‌లో వాతావరణం పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నందున.. కోహ్లీసేన నలుగురు పేసర్లతోనే బరిలోకి దిగేలా కనబడుతోంది. శార్దుల్ ఠాకూర్ ఫిట్​నెస్ సాధించినప్పటికీ.. లార్డ్స్‌లో సత్తా చాటిన బౌలింగ్ దళాన్నే కొనసాగిస్తామని కోహ్లీ తెలిపాడు. తొలి టెస్టులో ఆడే అవకాశం రాక డగౌట్​లో ఉన్న సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ.. రెండో టెస్టులో ఆకట్టుకున్నాడు. కెరీర్​లోనే అత్యున్నత ఫామ్‌లో ఉన్న హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్‌తో భారత బౌలింగ్ దళం భీకరంగా కనిపిస్తోంది. కచ్చితమైన ప్రదేశాల్లో బంతులు వేస్తూ సిరాజ్ ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెడుతున్నాడు. లీడ్స్ మైదానంలో 2002లో చివరి మ్యాచ్ ఆడిన భారత్.. ఇంగ్లాండ్​పై ఇన్నింగ్స్ 46 పరుగులతో ఘన విజయం సాధించింది.

ఒత్తిడంతా రూట్​పైనే..

మరోవైపు.. టాప్ ఆర్డర్ వైఫల్యం, గాయాలు ఇంగ్లాండ్‌ను కలవరపెడుతున్నాయి. కెప్టెన్ రూట్‌పై ఒత్తిడి తగ్గించేందుకు పరుగులు రాబట్టే మరో ఆటగాడి కోసం ఆ జట్టు అన్వేషిస్తోంది. రూట్‌పై అతిగా ఆధారం పడటం ఇంగ్లాండ్‌కు నష్టం చేకూరుస్తోంది. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న సిబ్లీ స్థానంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌ స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ డేవిడ్ మలన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. డేవిడ్ మలన్ చివరగా మూడేళ్ల క్రితం టెస్టు మ్యాచ్ ఆడగా.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్ అనుభవం జట్టుకి కలిసొస్తుందని రూట్‌ సేన భావిస్తోంది. బర్న్స్‌తో కలిసి హమీద్ ఓపెనింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.

బౌలింగ్ పరంగా చూస్తే.. తన పేస్‌తో రెండో టెస్టులో భారత్ బ్యాట్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన మార్క్‌వుడ్ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. సాకిబ్ మహమ్మద్ అరంగేట్రం చేయనున్నాడు రెండో టెస్టులో చేసిన తప్పులను పునరావతం కానివ్వకుండా సమష్టిగా రాణించి సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.