టీమ్ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు గాయమైంది. ఆ గాయం వల్ల మోకాలి నుంచి రక్తం వస్తున్నా సరే అతడు బౌలింగ్ చేయడం క్రికెట్‌పై ఎంత మమకారం ఉందో ఇదే చూస్తే అర్థం అయిపోతుంది. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్య రహానె బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇది జరిగింది.

కోహ్లీ-అండర్సన్ సన్నిహితంగా..
మైదానంలో ఉప్పు, నిప్పులా ఉండే విరాట్ కోహ్లీ, జేమ్స్ అండర్సన్.. నాలుగో టెస్టులో భిన్నంగా కనిపించారు. ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉంటూ.. లంచ్ బ్రేక్ సమయంలో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ పెవిలియన్ వరకు నడుచుకుంటూ వచ్చారు.

తొలిరోజు టీమ్ఇండియా ఇన్నింగ్స్ 22వ ఓవర్లో అండర్సన్ బౌలింగ్ తీరును టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభినందించాడు. గత టెస్టులో వాగ్వాదానికి దిగిన వీరిద్దరూ ప్రస్తుతం ఆనందంగా కలిసి మాట్లాడుకోవడం వల్ల క్రికెట్ అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది.
ఇదీ చూడండి.. IND Vs ENG: భారత్ తడబాటు.. టీ విరామానికి 122/6