ENG vs SA World Cup 2023 : 2023 ప్రపంచకప్‌లో భాగంగా ముంబయి వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై.. సౌతాఫ్రికా పంజా విసిరింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో డిఫెండింగ్ ఛాంప్‌ను 229 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి.. ఇంగ్లాండ్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో ఇంగ్లాండ్ ఘోరంగా విఫలమైంది. 22 ఓవర్లలో 170 పరుగులకే పరిమితమైంది. సఫారీల బౌలింగ్ ముందు డిఫెండింగ్ ఛాంప్ బ్యాటర్లు నిలువలేకపోయారు. వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్‌కు క్యూ కట్టారు. మార్క్ వుడ్ (43*), గస్ అట్కిసన్ (35) మాత్రమే రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో గెర్లాడ్ 3, మార్కొ జాన్సన్ 2, లుంగి ఎంగిడి 2, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్‌లో చెరో వికెట్ పడగొట్టారు. సూపర్ సెంచరీతో కదం తొక్కిన హెన్రిచ్ క్లాసెన్ (109)కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
-
🇿🇦 RAISE YOUR FLAG
— Proteas Men (@ProteasMenCSA) October 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A statement win for the Proteas as they a notch 229 victory over England 🏏
One down on to you @Springboks🇿🇦 we are fully behind YOU 🫂 #CWC23 #BePartOfIt pic.twitter.com/P2WYANYfwo
">🇿🇦 RAISE YOUR FLAG
— Proteas Men (@ProteasMenCSA) October 21, 2023
A statement win for the Proteas as they a notch 229 victory over England 🏏
One down on to you @Springboks🇿🇦 we are fully behind YOU 🫂 #CWC23 #BePartOfIt pic.twitter.com/P2WYANYfwo🇿🇦 RAISE YOUR FLAG
— Proteas Men (@ProteasMenCSA) October 21, 2023
A statement win for the Proteas as they a notch 229 victory over England 🏏
One down on to you @Springboks🇿🇦 we are fully behind YOU 🫂 #CWC23 #BePartOfIt pic.twitter.com/P2WYANYfwo
ఛేదనలో చతికిలపడ్డ ఇంగ్లాండ్.. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కనీసం పోరాట పటిమ చూపకుండా 11.1 ఓవర్లకే జట్టులోని సగం మంది బ్యాటర్లు.. పెవిలియన్ చేరారు. బెయిర్ స్ట్రో (10), మలన్ (6), రూట్ (2), స్టోక్స్ (5), హ్యారీ బ్రూక్ (17), బట్లర్ (15) ఇలా టపార్డర్ బ్యాటర్లందరూ విఫలమయ్యారు. చివర్లో మార్క్ వుడ్ (43), అట్కిసన్ (35) పోరాడి.. ఓటమి అంతరాన్ని తగ్గించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. ఇన్నింగ్స్ రెండో బంతికే క్వింటన్ డికాక్ (4) వికెట్ కోల్పోయింది. దీంతో మరో ఓపెనర్ హెన్రిక్స్ (85 పరుగులు).. వన్‌డౌన్‌లో వచ్చిన వాన్ డర్ డస్సెన్ (60 పరుగులు)తో కలిసి స్కోర్ బోర్డును జెట్ స్పీడ్‌లో పరిగెత్తించాడు. వీరిద్దరూ ఇంగ్లాండ్‌కు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా.. 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 19.4 ఓవర్ వద్ద వాన్ డర్ డస్సెన్ ఆదిల్ రషీద్‌కు చిక్కాడు. తర్వాత వచ్చిన బ్యాటర్ మర్క్రమ్ (42) ఫర్వాలేదనిపించాడు.
రెచ్చిపోయిన క్లాసెన్, జాన్సన్.. సౌతాఫ్రికా స్కోర్ ఎక్కడ కూడా 6 రన్‌రేట్ తగ్గలేదు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన క్లాసెన్ (109 పరుగులు: 67 బంతులు; 12x4, 4x6).. ఇంగ్లాండ్ బౌలర్లను చీల్చి చెండాడాడు. ఊహించని రీతిలో రెచ్చిపోయి శతకం నమోదు చేశాడు ఇక ఆఖర్లో మార్కొ జాన్సన్ (75 పరుగులు : 42 బంతుల్లో; 3x4; 6x6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓ దశలో సౌతాఫ్రికా స్కోర్ 400 దాటుతుందనిపించింది. కానీ, చివర్లో ఇంగ్లాండ్ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టోప్లే 3, అట్కిసన్ 2, ఆదిల్ రషీద్ 2 వికెట్లు పడగొట్టారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ODI World cup 2023 England : ఇంగ్లాండ్ ఖాతాలో చెత్త రికార్డ్.. ప్రపంచ కప్ చరిత్రలో తొలి జట్టుగా!
ODI World Cup 2023 England Team : ఫేవరెట్‌గా డిఫెండింగ్ ఛాంపియన్.. అదొక్కటే మైనస్