ETV Bharat / sports

చెన్నైకి షాక్.. రూ.14 కోట్ల ప్లేయర్ ఈ సీజన్​కు దూరం! - deepak chahar ipl auction 2022 price

Deepak Chahar IPL 2022: ఐపీఎల్​కు ముందు చెన్నై సూపర్​ కింగ్స్​కు షాక్​ తగిలింది! భారీ ధరకు కొనుగోలు చేసిన ఫాస్ట్​బౌలర్​ దీపక్​ చాహ​ర్​ గాయం కారణంగా ఈ సీజన్​కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్డిండీస్​తో జరిగిన సిరీస్​ల చాహర్​ గాయపడటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

Deepak Chahar
Deepak Chahar
author img

By

Published : Feb 23, 2022, 6:01 PM IST

Deepak Chahar IPL 2022: ఈ ఏడాది ఐపీఎల్​ సీజన్​కు ముందు చెన్నై సూపర్​ కింగ్స్​కు పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఐపీఎల్ వేలంలో కోట్లు కుమ్మరించి సొంతం చేసుకున్న ఫాస్ట్​బౌలర్​ దీపక్ చాహర్​ గాయం కారణంగా ఈ సీజన్​కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో బ్యాటింగ్​, బౌలింగ్​ విభాగాల్లో నిలకడగా రాణిస్తున్న చాహర్​.. సీజన్​ మొత్తం అందుబాటులో ఉండకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే జట్టు ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

మరోవైపు వచ్చేనెల చివరి వారం నుంచి మే వరకు భారత్‌లో ఐపీఎల్ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు త్వరలోనే మ్యాచ్‌లు వేదికలు మరికొన్ని రోజుల్లో ప్రకటించనుంది. ఈ తరుణంలో ఐపీఎల్​ సీజన్​ కోసం మార్చి రెండో వారం నుంచి సీఎస్కే సన్నాహాలను ప్రారంభించాలని యోచిస్తోంది. దీంతో జట్టు కూర్పు ప్రణాళికల్లో మార్పులు జరగొచ్చు. అయితే చాహర్​ గాయం నుంచి త్వరగా కోలుకుని ఈ సీజన్​ మొత్తం అందుబాటులో ఉంటాడని చెన్నై సూపర్​కింగ్స్ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇటీవల జరిగిన ఐపీఎల్​ మెగా వేలంలో చాహర్​ కోసం.. చెన్నై సహా రాజస్థాన్​​,​ హైదరాబాద్​, దిల్లీ జట్లు​ పోటీ పడ్డాయి. అయితే సీఎస్కే రూ.14 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి, అతన్ని తిరిగి సొంతం చేసుకుంది. దీంతో వేలంలో రెండో అత్యధిక ధర పలికిన భారత ఆటగాడి చాహర్ నిలిచాడు.

ఈ నెల 20న వెస్డిండీస్​తో ఆఖరి టీ20లో చాహర్​ మోకాలి గాయపడ్డాడు. దీంతో 1.5 ఓవర్లు బౌలింగ్​ చేసి, మైదానం నుంచి బయటకొచ్చేశాడు. ఆ గాయం నుంచి దీపక్​ ఇంకా కోలుకోలేదని బీసీసీఐ అధికారి తెలిపారు. ఫలితంగా దీపక్​ ఇప్పటికే స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్​కు దూరమైనట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ICC T20I Rankings: దుమ్ములేపిన సూర్యకుమార్, వెంకటేశ్ అయ్యర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.