విండీస్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షార్పణం
సౌతాంప్టన్ వేదికగా వెస్టిండీస్ - దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. చాలాసేపటివరకు కురిసిన వర్షం మధ్యలో ఆగినా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ నిర్వహించేందుకు వీలు పడలేదు. మేఘావృతమై ఉండటంతో రిఫరీ మ్యాచ్ నిలిపివేశాడు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 7.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి 29 పరుగులు చేసింది. జూన్ 7న బ్రిస్టల్ వేదికగా జరగాల్సిన శ్రీలంక - పాకిస్థాన్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది.