టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టెస్టు ఫార్మాట్‌పై తనకున్న ఇష్టాన్ని వెల్లడించాడు. తెలుపు దుస్తుల్లో ఆడినప్పుడు ఆటలో తీవ్రత మరోలా ఉంటుందని, భారత్ తరఫున టెస్టుల్లో పాల్గొనడం తన అదృష్టమని అన్నాడు. అందుకు సంబంధించిన పాత ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుని ఆనందం వ్యక్తం చేశాడు.
స్పందించిన అభిమానులు.. 'కింగ్ కోహ్లీ', 'టెస్టుల్లో కోహ్లీనే కింగ్', 'మైదానంలో నీ ఆటను చాలా మిస్సవుతున్నాం' అంటూ కామెంట్లు పెట్టారు.
లాక్డౌన్ ప్రభావంతో మార్చి నుంచి అన్ని రకాల క్రీడలు నిలిచిపోయాయి. ఇటీవలే సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పలు దేశాల క్రికెట్ బోర్డులు.. మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే నెల 8 నుంచి ఇంగ్లాండ్-వెస్టిండీస్ టెస్టు సిరీస్ జరగనుంది. దీనిని బయో సెక్యూర్ వాతావరణంలో జరపనున్నారు.
అయితే ఇదే విషయమై మాట్లాడిన కోహ్లీ.. స్టేడియంలో ప్రేక్షకుల ఉన్నప్పుడు ఆటలో మజా వేరుగా ఉంటుందని, లేదంటే అలాంటి ఎమోషన్స్ ఉండవని చెప్పాడు.
ఇవీ చదవండి:
- శ్రీశాంత్ ఎక్స్‌క్లూజివ్: కోహ్లీతో పోలిస్తే స్మిత్ పిల్లాడు
- దివ్యాంగురాలికి.. విరాట్ ఆత్మీయ 'ఆటోగ్రాఫ్'
- 'కోహ్లీ క్రీజులో నిలిస్తే అతని వేగాన్ని ఆపడం కష్టం'
- 'కోహ్లీ, స్మిత్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్'
- కోహ్లీని ఈసారి స్లెడ్జింగ్ చేయను: డేవిడ్ వార్నర్
- 'కోహ్లీ లాంటి లక్షణాలే బెన్స్టోక్స్లోనూ'
- 'కోహ్లీ ప్రేయసితో చాట్ చేస్తే అతడికి నచ్చేది కాదు'
- 'కోహ్లీ ఒక్కడు కాదు.. జట్టు మొత్తంతో సమానం'
- ఆ దేశంలోని రోడ్లకు సచిన్, కోహ్లీల పేర్లు
- 'కోహ్లీ, రోహిత్ వన్డే స్వరూపాన్నే మార్చేశారు'