టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. తన ఎంతో ఇష్టంగా పెంపుడు కుక్క బ్రూనో.. ఈరోజు ఉదయం చనిపోయిందని బాధపడ్డాడు. ఓ ఫొటో ట్వీట్ చేసి, తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చాడు. ఇదే విషయమై ఇన్స్టాలో విరాట్ సతీమణి అనుష్క శర్మ పోస్ట్ పెట్టింది.
'11 ఏళ్ల మన ప్రయాణం జీవితాంతం తీపిగుర్తుగా మిగిలిపోతుంది. ఎప్పుడూ మాపై ప్రేమను కురిపించావు. ఈరోజు ఇక్కడ నుంచి వేరే చోటుకు వెళ్లిపోయావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని కోరుకుంటున్నా. రెస్ట్ ఇన్ పీస్ బ్రూనో' -కోహ్లీ, టీమిండియా కెప్టెన్
విరుష్క జోడీకి బ్రూనోతో ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈ కుక్కతో దిగిన ఫొటోలను తరుచుగా షేర్ చేస్తూ ఉండేవారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా వీరిద్దరూ ఇంట్లోనే ఉన్నారు.