ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ.. టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించడం కష్టమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహ్సాన్ మణి అభిప్రాయపడ్డారు. బయో సెక్యూర్ విధానంలో ద్వైపాక్షిక సిరీస్ జరపొచ్చు.. కానీ అనేక జట్లు పాల్గొనే మెగాటోర్నీని జరపడం కష్టమని తెలిపారు.
"మేము చాలా చర్చలు జరిపాం. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ సాధ్యం కాదని అనుకుంటున్నాం. 2021, 23 సంవత్సరాల్లో ప్రపంచకప్‌లు జరగాల్సి ఉంది. కాబట్టి ఈ షెడ్యూల్‌ను సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది.
ఎహ్సాన్ మణి, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్.
"టోర్నీ సమయంలో ఎవరైనా ఆటగాళ్లు అనారోగ్యానికి గురైనా, ప్రమాదం సంభవించినా.. క్రికెట్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందరినీ భయాందోళన చెందేలా చేస్తుంది. అటువంటి సాహసం మేము తీసుకోలేమం" అని తెలిపారు.
సాధారణంగా ఈ టోర్నీ అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు జరగాల్సి ఉంది. అయితే, వివిధ దేశాల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా నిర్వహణపై సందిగ్ధత నెలకొంది
ఇదీ చూడండి:పద్మశ్రీకి విజయన్ పేరు సిఫార్సు