ETV Bharat / sports

భీకర బౌలర్లను హెల్మెట్ లేకుండా ఎదుర్కొన్నాడు!​

1970ల్లో ప్రపంచ క్రికెట్​ సామ్రాజాన్ని శాసిస్తున్న వెస్టిండీస్​ జట్టు గర్వం అణిచేశాడు దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​. అరంగేట్రం చేసిన టెస్టు సిరీస్​లో మెరుపు ఇన్నింగ్స్​తో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. నాలుగు మ్యాచ్​లలో 774 పరుగులు చేసి విదేశీ గడ్డపై​ భారత జట్టు విజయానికి దోహదపడ్డాడు. అప్పటి టెస్టు సిరీస్​ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

SPECIAL STORY ON SUNIL GAVASKAR
చరిత్రలో ఓ పేజీ: విండీస్​ జట్టుపై గావస్కర్​ దండయాత్ర
author img

By

Published : May 15, 2020, 6:59 AM IST

ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో భారత్‌ ఓ అగ్ర జట్టు. మన దేశంలో క్రికెట్‌కున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆటతోనే కాదు.. తన ఆర్థిక బలంతోనూ భారత్‌ ప్రపంచ క్రికెట్‌ను ఏలుతోంది. అయితే ఈ రోజు భారత క్రికెట్‌ ఈ స్థాయిలో ఉండటానికి పునాది పడింది 1971లో. ఆ ఏడు సాధించిన ఓ అద్భుత విజయం భారత క్రికెట్లో ఓ మేలి మలుపు. మన క్రికెట్‌ సత్తా ప్రపంచానికి తెలిసింది అప్పుడే. దేశంలో క్రికెట్‌ పట్ల అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది ఆ సందర్భంలోనే. ఒక యోధుడి సంచలన అరంగేట్రం.. నాటి సిరీస్‌ ఫలితాన్నే మార్చేసింది. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అరివీర భయంకర వెస్టిండీస్‌కు గర్వభంగం చేసిన ఆ యోధుడి పేరు.. సునీల్‌ గావస్కర్‌.

70వ దశకంలో వెస్టిండీస్‌ ప్రపంచ క్రికెట్లో సాగించిన ఆధిపత్యం గురించి కథలు కథలుగా చెబుతారు. అలాంటి సమయంలో 5 టెస్టుల సిరీస్‌ కోసం కరీబియన్‌ పర్యటనకు వెళ్లింది అజిత్‌ వాడేకర్‌ నేతృత్వంలోని భారత జట్టు. సోబర్స్‌, రాయ్‌ ఫ్రెడ్రిక్స్‌, లాయిడ్‌, హోల్డింగ్‌, షిలింగ్‌ఫోర్డ్‌.. ఇలా ఆ జట్టు నిండా దిగ్గజాలే. భారత జట్టులోనూ స్టార్లున్నప్పటికీ.. కరీబియన్‌ జట్టు ముందు వాళ్ల 'స్టార్‌ పవర్‌' ఎంతమాత్రం నిలిచేది కాదు. ఆ రోజుల్లో పేస్‌ పిచ్‌లపై విండీస్‌ ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కోవడం కంటే మించిన సవాలు మరేదీ లేదు.

ఇటు చూస్తే భారత పేస్‌ విభాగం బలహీనం. స్పిన్నర్లదే భారం. ఈ నేపథ్యంలో భారత్‌కు పరాభవం తప్పదన్నది విశ్లేషకుల అంచనా! తొలి టెస్టులో వర్షం వల్ల ఒక రోజు ఆట రద్దయ్యాక రెండో రోజు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ మధ్యాహ్నానికి 75/5తో నిలిచేసరికి అంచనాలు నిజమవుతున్నట్లే అనిపించింది. టీమ్‌ఇండియా ఓ క్లబ్‌ జట్టంటూ ఎద్దేవా చేస్తున్న రేడియో వ్యాఖ్యానాలు ఆటగాళ్ల చెవుల్లోనూ పడ్డాయి. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వెళ్లిన సోల్కర్‌ విషయాన్ని క్రీజులో కుదురుకున్న దిలీప్‌ సర్దేశాయ్‌ చెవిన వేశాడు. అక్కడ రగిలింది కసి! కట్‌ చేస్తే.. భారత్‌ స్కోరు 387. అంటే చివరి 5 వికెట్లకు జోడించిన పరుగులు ఏకంగా 312 అన్నమాట.

సోల్కర్‌ (61), ప్రసన్న (25)ల సాయంతో అసాధారణ పోరాటం సాగించిన సర్దేశాయ్‌ 212 పరుగులు చేశాడు. విండీస్‌ ఊహించని ప్రతిఘటన ఇది. ఆ షాక్‌ నుంచి తేరుకోక ముందే స్పిన్‌ త్రయం బేడి, ప్రసన్న, వెంకటరాఘవన్‌ల ధాటికి ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకే ఆలౌటైంది. తొలి రోజు ఆట రద్దయిన నేపథ్యంలో 150+ ఆధిక్యానికే విండీస్‌ను ఫాలోఆన్‌ ఆడించే అవకాశం వచ్చింది భారత్‌కు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో స్థాయికి తగ్గట్లు ఆడిన విండీస్‌.. 5 వికెట్లకు 385 పరుగులు చేసి డ్రాతో గట్టెక్కింది.

అతనొచ్చాడు..

తొలి టెస్టులో ఫాలోఆన్‌ ఆడమని కెప్టెన్‌ వాడేకర్‌ వెస్టిండీస్‌ ఆటగాళ్లకు చెప్పినపుడు వాళ్ల ముఖాలు అవమానభారంతో కనిపించాయట. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో విండీస్‌ రెచ్చిపోవడం ఖాయమని విశ్లేషకులన్నారు. కానీ తొలి టెస్టులో ఓటమి భయం పుట్టించిన టీమ్‌ఇండియా.. ఏకంగా ఓటమినే రుచి చూపించింది. ఆ అద్భుతంలో 21 ఏళ్ల కొత్త కుర్రాడిది కీలక పాత్ర. అతనే గావస్కర్‌. వేలి గాయం కారణంగా అతను తొలి టెస్టులో ఆడలేకపోయాడు.

రెండో టెస్టుతో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. స్పిన్‌ త్రయం మరోసారి విజృంభించడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 214 పరుగులకే చేతులెత్తేసింది. అశోక్‌ మన్కడ్‌ (44)తో కలిసి జట్టుకు చక్కటి ఆరంభాన్నిచ్చాడు లిటిల్‌ మాస్టర్‌. ఆరంభంలో కొంత ఒత్తిడికి గురైనా.. తర్వాత కుదురుకుని 65 పరుగులు చేశాడు సన్నీ. అతడి ఆటకు ముగ్ధుడైన కన్హాయ్‌ స్లిప్‌ నుంచి 'వెల్‌ ప్లేయ్​డ్​సన్‌' అంటూ అభినందించాడట. ఫామ్‌ను కొనసాగిస్తూ సర్దేశాయ్‌ (112) మరో మేటి ఇన్నింగ్స్‌ ఆడటం వల్ల భారత్‌ 352 పరుగులు చేసి, 138 పరుగుల ఆధిక్యాన్ని మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ 261 పరుగులు చేసింది. భారత్‌ లక్ష్యం 124.

ఇదేమంత సులువైన లక్ష్యం కాదనే అన్నారంతా. కానీ విండీస్‌ పేసర్లను మరోసారి ధైర్యంగా ఎదుర్కొంటూ గావస్కర్‌ మరో అర్ధశతకం (67 నాటౌట్‌) సాధించాడు. 3 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది భారత్‌. అంచనాల్లేని జట్టు.. విండీస్‌ను ఓడించడం క్రికెట్‌ ప్రపంచంలో సంచలనమైంది. మూడో టెస్టు మామూలుగానే సాగి డ్రాగా ముగిసింది. సన్నీ తొలి సెంచరీ చేసింది ఆ మ్యాచ్‌లోనే. ఆ వార్త త్వరగా తన తల్లిదండ్రులకు చేరవేయడానికి తపన పడిపోయాడతను.

హనీమూన్‌ ముగిసిందన్నారు..

అయితే నాలుగో టెస్టు ముంగిట భారత్‌కు పెద్ద షాక్‌. బార్బడోస్‌ జట్టుతో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో చిత్తయింది. దీనికి తోడు అసలు మ్యాచ్‌లోకి వచ్చేసరికి విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ జూలు విదిల్చారు. 501/5 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది ఆతిథ్య జట్టు. తర్వాత భారత్‌ 70/6తో నిలిచింది. సన్నీ చేసింది ఒక్క పరుగే. ఇలాంటి స్థితిలో భారత్‌ మ్యాచ్‌ను కాపాడుకుంటుందని ఎవ్వరూ అనుకోలేదు. టీమ్‌ఇండియా హనీమూన్‌ ముగిసిందన్న వ్యాఖ్యలు వినిపించాయి.

కానీ సర్దేశాయ్‌ (150)లోని హీరో మళ్లీ నిద్ర లేచాడు. భారత్‌కు ఫాలోఆన్‌ తప్పించాడు.. 347కి ఆలౌట్‌! రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన విండీస్‌.. సిరీస్‌లో అప్పటిదాకా భారత్‌ ఆడిన తీరు చూసి కాస్త భయపడింది. డిక్లరేషన్‌ ఆలస్యం చేసింది. అయిదో రోజు కానీ భారత్‌కు బ్యాటింగ్‌ ఇవ్వలేదు. లక్ష్యం 335. 79కే మూడు వికెట్లు పడ్డాయి. కానీ తొలి ఇన్నింగ్స్‌ వైఫల్యాన్ని కప్పిపుచ్చుతూ సన్నీ (117) నిలబడ్డాడు. కఠినమైన పిచ్‌పై, ప్రతికూల పరిస్థితుల్లో కరీబియన్‌ బౌలర్లను ఎదుర్కొన్నాడు. భారత్‌ 221/5తో బయటపడింది.

అల్లాడుతూనే..

చివరి టెస్టు ముంగిట గావస్కర్‌ పంటి నొప్పితో అల్లాడిపోయాడు. పన్ను తీస్తే మ్యాచ్‌ ఆడటం కష్టమని, పెయిన్‌ కిల్లర్లు వేస్తే మత్తుగా ఉంటుందని చెప్పిన మేనేజర్‌ నొప్పిని భరించమన్నాడు. ఆ బాధతోనే అతను తొలి రోజు బ్యాటింగ్‌కు దిగి సెంచరీ (124) కొట్టాడు. భారత్‌ 360 పరుగులు చేసింది. తర్వాత వెస్టిండీస్‌ 526 పరుగుల భారీ స్కోరు సాధించింది. 166 పరుగుల లోటుతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. పంటి నొప్పి కారణంగా సన్నీకి మూడు రోజులుగా సరైన నిద్ర లేదు. పైగా నొప్పి పెరిగింది.

ఈ స్థితిలో అతను సాగించిన పోరాటం అసమానం. అనుభవజ్ఞులు నిలవలేకపోతుంటే.. తొలి సిరీస్‌ ఆడుతున్న అతను హెల్మెట్‌ లేకుండా భీకర ఫాస్ట్‌బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ డబుల్‌ సెంచరీ (220) సాధించాడు. సన్నీ నిలవకపోతే ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయేదే. అతడి వల్లే 427 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు 262 పరుగుల లక్ష్యాన్ని నిలపగలిగింది. 40 ఓవర్లే ఆడి 165/8కు పడ్డ విండీస్‌.. అతి కష్టం మీద ఓటమి తప్పించుకుంది. భారత జట్టు 1-0తో సిరీస్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. అరంగేట్ర సిరీస్‌.. అందులోనూ భీకర విండీస్‌ను వారి సొంతగడ్డపై ఎదుర్కొంటూ నాలుగు టెస్టుల్లోనే సన్నీ 774 పరుగులు చేయడం విశేషం. ఈ విజయంతో స్వదేశంలో స్వాగతం, సన్మానాలు, సంబరాలు చూస్తే దేశంలో క్రికెట్‌ అభిమానం ఏ స్థాయికి పెరిగిందో భారత ఆటగాళ్లకు అర్థమైంది. ఈ అభిమానం 1983 ప్రపంచకప్‌ విజయంతో మరో స్థాయికి చేరింది.

బ్యాట్స్​మెన్​ : సునీల్ గావస్కర్​

సిరీస్​ : 1971, వెస్టిండీస్​

టెస్టులు : 4

పరుగులు : 774 (1 డబుల్​ సెంచరీ, 3 సెంచరీలు, 4 అర్ధశతకాలు)

ఫలితం : సిరీస్​ 1-0తో భారత్​ వశం

ఇదీ చూడండి.. 'ధోనీ జట్టులోకి వస్తే టాపార్డర్​లో పంపాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.