అతను క్రీజులో ఉంటే ప్రత్యర్థి వెన్నులో వణుకుపుడుతుంది. బంతిని బలంగా బాదిన మరుక్షణం ప్రేక్షుకుల ఈలలు, గోలతో స్టేడియం హోరెత్తుతుంది. బౌలర్ ఎవరైనా బంతి బౌండరీ దాటాల్సిందే.. నిలిచాడా గెలుపు పక్కా.. అతనెవరో కాదు రో'హిట్' శర్మ. న్యూజిలాండ్తో జరిగిన రెండో టీట్వంటీలో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
మ్యాచ్లో 29 బంతుల్లో 50 పరుగులు చేసిన రోహిత్ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ గప్తిల్ చేసిన 2,272 పరుగులే ఇప్పటివరకు అత్యధికం కాగా.. ఈరోజు మ్యాచ్లో ఆ రికార్డును చెరిపేశాడు. ప్రస్తుతం 2,288 పరుగులతో రోహిత్ ప్రథమ స్థానంలో ఉండగా, గప్తిల్ రెండు, పాకిస్థాన్ బ్యాట్స్మెన్ షోయబ్ మాలిక్ మూడు, 2,167 పరుగులతో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు.
రోహిత్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరపున 100 సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్గా గుర్తింపుపొందాడు. గప్తిల్ (103), క్రిస్ గేల్ (103) ఇప్పటికే 100 సిక్సులు కొట్టిన జాబితాలో ఉన్నారు.
#TeamIndia win by 7 wickets. Level the three match series 1-1 😎😎#NZvIND pic.twitter.com/kudlWM0r9X
— BCCI (@BCCI) February 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#TeamIndia win by 7 wickets. Level the three match series 1-1 😎😎#NZvIND pic.twitter.com/kudlWM0r9X
— BCCI (@BCCI) February 8, 2019#TeamIndia win by 7 wickets. Level the three match series 1-1 😎😎#NZvIND pic.twitter.com/kudlWM0r9X
— BCCI (@BCCI) February 8, 2019
---> ఇంకా చూడండి: తొలి టీ20లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్న టీంఇండియా