ETV Bharat / sports

ఐపీఎల్:  బెంగళూరును ఊచకోత కోసిన హైదరాబాద్!

ఐపీఎల్​లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్​తో జరిగిన మ్యా​చ్​లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. విశ్వరూపం ప్రదర్శించింది. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసినట్టుగా.. శివాలూగినట్టుగా ఆడిన హైదరాబాద్ ఆటగాళ్లు.. విధ్వంసం అంటే ఎలా ఉంటుందో తమ బ్యాటింగ్​తో రుచి చూపించారు. సెంచరీల మోత మోగించారు.

author img

By

Published : Mar 31, 2019, 5:41 PM IST

Updated : Mar 31, 2019, 5:47 PM IST

బెంగళూరును ఊచకోత కోసిన హైదరాబాద్

ఐపీఎల్​లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్​తో జరిగిన మ్యా​చ్​లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. విశ్వరూపం ప్రదర్శించింది. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసినట్టుగా.. శివాలూగినట్టుగా ఆడిన హైదరాబాద్ ఆటగాళ్లు.. విధ్వంసం అంటే ఎలా ఉంటుందో తమ బ్యాటింగ్​తో రుచి చూపించారు. సొంతమైదానం.. హైదరాబాద్​లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరుకు... మండుటెండలో చుక్కలు చూపించారు. ఫోర్లు, సిక్సులతో పరుగులు వర్షం కురిపించారు. కొడితే బౌండరీ, కాదంటే సిక్స్ అన్నట్టుగా ఆడిన ఓపెనర్ జానీ బెయిర్ స్టో.. 56 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో.. ఏకంగా 114 పరుగులు చేశాడు. తొలి వికెట్​కు 185 పరుగుల రికార్డు భాగస్వామ్యం జోడించిన అనంతరం... యజువేంద్ర చాహల్ బౌలింగ్ లో ఉమేష్​కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సగటున బంతికి 2 పరుగుల కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో బెంగళూరు బౌలర్లను భోరున విలపించేలా చేశాడు.

సెంచరీతో చెలరేగిన వార్నర్

బెంగళూరును ఊచకోత కోసిన హైదరాబాద్
బెంగళూరును ఊచకోత కోసిన హైదరాబాద్

తానేం తక్కువ కాదన్నట్టు.. బెయిర్ స్టో కు పోటీగా చెలరేగాడు ఓపెనర్ డేవిడ్ వార్నర్. చివరి ఓవర్ నాలుగో బంతికి బౌండరీ బాది.. సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 55 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులు బాదిన వార్నర్ 100 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. వన్ డౌన్ లో వచ్చిన విజయ్ శంకర్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర రనౌట్ అయ్యాడు. పఠాన్ 6 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. హైదరాబాద్ ఆటగాళ్ల ధాటికిబెంగళూరు బౌలర్లలో దాదాపు అందరూ ఓవర్​కు సగటున 10 పరుగులపైనే సమర్పించుకున్నారు.

బెంగళూరు టార్గెట్ 232

నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 231 పరుగుల భారీ స్కోరును హైదరాబాద్ జట్టు సాధించింది. బెంగళూరుకు 232 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

sample description
Last Updated : Mar 31, 2019, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.