ETV Bharat / sports

'ధోనీ ఎవర్​గ్రీన్.. క్రికెట్​లో ఇంకా కొనసాగాలి'

నలభైల్లోనూ ధోనీ అద్భుత ఆటతీరు కనబరుస్తున్నాడని చెప్పిన షేన్​ వాట్సన్​.. క్రికెట్​లో మహీ ఎవర్​గ్రీన్​ అని అన్నాడు. మరికొంత కాలం క్రికెట్​లో కొనసాగాలని అతడికి సూచించాడు.

IPL 2020: MS Dhoni is an evergreen cricketer and it feels like he just doesn't age, Shane Watson
క్రికెట్​లో ధోనీనే ఎవర్​గ్రీన్​: వాట్సన్​
author img

By

Published : Aug 12, 2020, 12:37 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​​ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, చెన్నై సూపర్​కింగ్స్ సభ్యుడు​ షేన్​ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు​. 40 ఏళ్ల వయసులోనూ అలుపెరగకుండా, ధోనీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని తెలిపాడు. మహీకి తాను పెద్ద అభిమాని అని.. క్రికెట్​లో అతను కొంతకాలం కొనసాగాలని అభిప్రాయపడ్డాడు.

"ధోనీ.. క్రికెట్​ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. ప్రస్తుత ఆటగాళ్లలో అతడే ఎవర్​గ్రీన్​. వయసు మళ్లిన క్రికెటర్​గా అసలు కనిపించడు. 40 ఏళ్ల వయసులోనూ ఫిట్​నెస్​ను కాపాడుకుంటున్నాడు. వికెట్ల మధ్య మహీ పరుగు, వికెట్​కీపర్​ నైపుణ్యం ఉత్తమం. అతడికి నేను పెద్ద అభిమానిని. ఐపీఎల్​లోపాటు అంతర్జాతీయ క్రికెట్​లోనూ మహీ కొనసాగాలని కోరుకుంటున్నా. యూఏఈలో పిచ్​లు మందకొడిగా ఉంటాయి. అందువల్ల చెన్నై జట్టులో ఉత్తమ స్పిన్నర్లను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది"

- షేన్​ వాట్సన్​, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్​

గతేడాది ప్రపంచకప్​లో సెమీస్​ ఓటమి తర్వాత మైదానంలో కనిపించలేదు ధోనీ. యూఏఈలో సెప్టెంబరు 19 నుంచి మొదలుకానున్న ఐపీఎల్​తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.​ ఇప్పటికే ప్రాక్టీసు కూడా ప్రారంభించాడు.

ఐపీఎల్​-2018 సీజన్​ నుంచి చెన్నై సూపర్​కింగ్స్​కు ఆడుతున్న వాట్సన్.. జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. గతేడాది ఐపీఎల్ ఫైనల్​లో ముంబయిపై 59 బంతుల్లో 80 పరుగులు చేసి 'మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​'గా నిలిచాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.