న్యూజిలాండ్‌తో జరుగుతోన్న ఐదో వన్డేలో భారత్ టాప్ ఆర్డర్ మరోసారి చాపచుట్టేసింది. ఐదో ఓవర్లోనే తొలి వికెట్‌గా రోహిత్ (2) హెన్రీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. తరువాతి ఓవర్‌కే శిఖర్ ధావన్ (6)ను బౌల్ట్ పెవిలియన్‌కు పంపాడు. ఆ కాసేపటికే గిల్ (7) వికెట్ కోల్పోయింది భారత్. తరువాత క్రీజులోకి వచ్చిన ధోని (1)ని బౌల్ట్ బౌల్డ్ చేశాడు. రాయుడు (75*), విజయ శంకర్(45) నిలకడగా ఆడుతూ నాలుగోవికెట్‌కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. తరువాత విజయశంకర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. రాయుడు అర్థసెంచరీతో రాణించాడు. కేదార్ జాదవ్(22*), రాయుడు క్రీజులో ఉన్నారు. భారత్ 41 ఓవర్లకి 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
ఇప్పటికే 3-1తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్. ఐదో వన్డేలో విజయం సాధించి టీ-20 సిరీస్‌కు మరింత ఉత్తేజంగా సన్నద్ధమవ్వాలని చూస్తోంది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈ మ్యాచ్‌కు జట్టులో మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగింది. ధోని, మహ్మద్ షమీ, విజయ్ శంకర్ తిరిగి జట్టులో చేరారు.