ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్: బౌలర్ పూనమ్​ మూడో హ్యాట్రిక్​ మిస్​

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. జట్టులోని పూనమ్ యాదవ్​ అద్భుత ప్రదర్శన చేసినా, కెరీర్​లో మరో హ్యాట్రిక్​ను​ చేజార్చుకుంది.

poonam Yadav missed T20 World Cup hat-trick
భారత్​ గెలిపించిన పూనమ్​.. మూడోసారి హ్యాట్రిక్​ మిస్సైంది
author img

By

Published : Feb 21, 2020, 5:54 PM IST

Updated : Mar 2, 2020, 2:27 AM IST

మహిళా టీ20 ప్రపంచకప్​లో తొలిరోజే భారత్ అదరగొట్టింది. డిఫెండింగ్​ ఛాంపియన్, ఆతిథ్య​ ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్​లో టీమిండియా బౌలర్​ పూనమ్ యాదవ్​ 4 వికెట్లు పడగొట్టినా, కెరీర్​లో మరో హ్యాట్రిక్​ తీసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈమెకు ఇలా జరగడం మూడోసారి. మ్యాచ్​ అనంతరం 'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​' అవార్డు అందుకుంటూ ఈ విషయమై మాట్లాడింది పూనమ్​.

Indian Bowler Poonam Yadav
పూనమ్​ యాదవ్​

" గతంలో గాయంతో ఇబ్బందిపడినప్పుడు ఫిజియో, తోటి ఆటగాళ్ల నుంచి మంచి సహకారం లభించింది. ఇంతకు ముందు ఆసీస్​పై మంచి ప్రదర్శన చేశాను. అదే ఆటతీరు ఈరోజు కొనసాగించాను. అయితే ఈరోజుతో కలిపి మూడోసారి హ్యాట్రిక్​ చేజారింది. గాయం తర్వాత మళ్లీ జట్టులో చోటు దక్కించుకోవడం అంత సులభం కాదు. అయినా నాకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు"

--పూనమ్​ యాదవ్​, భారత బౌలర్​

హ్యాట్రిక్​ మిస్​

ఛేదనలో పూనమ్​.. 11వ ఓవర్​ మూడో బంతికి హైనెస్​ను స్టంపౌట్​గా పెవిలియన్​కు పంపిది. తర్వాతి బంతికే పెర్రీని క్లీన్​బౌల్డ్​ చేసింది. హ్యాట్రిక్​ బంతికి జొనస్సెన్​ ఔట్​ కావాల్సింది. కానీ వికెట్​ కీపర్​ భాటియా బంతిని పట్టుకోవడంలో విఫలమవడం వల్ల హ్యాట్రిక్​​ను చేజార్చుకుంది పూనమ్.

మొత్తంగా ఓపెనర్​ హేలీ(51), హైనెస్​(6), ఎలిస్​ పెర్రీ(0), జొనస్సెన్​(2) వికెట్లు తీసిన పూనమ్​ యాదవ్​.. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్‌ 19.5 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది.

Last Updated : Mar 2, 2020, 2:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.