ETV Bharat / sports

లాస్ట్​ పంచ్​ మనదేనా..!

న్యూజిలాండ్​తో వెస్ట్​పేక్​ మైదానం వేదికగా ఆదివారం ఐదో వన్డే జరగనుంది. ధోని రాకతో భారత బ్యాటింగ్​ తిరిగి గాడిలో పడేనా..? లేక బౌల్ట్​ దెబ్బకు భారత్​ మరోసారి క్లీన్​బౌల్డ్​ అయ్యేనా..!

author img

By

Published : Feb 2, 2019, 3:23 PM IST

మ్యాచ్

న్యూజిలాండ్​తో ఆదివారం జరిగే ఐదో వన్డేకు మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోని తిరిగి జట్టులోకి రానున్నాడు. నాలుగువన్డేలో ఘోర ఓటమి ఎదుర్కొన్న భారత్​కు ధోని రాక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. మరోవైపు కివీస్ నాలుగోవన్డేలో విజయంతో ఊపుమీద ఉంది. మొదటి మూడు వన్డేల్లో పటిష్టంగా ఉన్న భారత బ్యాటింగ్​ అనూహ్యాంగా గత మ్యాచ్​లో 92 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇప్పడు మిడిలార్డర్​లో ధోని ఉండటం భారత్​కు కలిసొచ్చే అంశం. మరి కివీస్ జోరుకు ధోని కళ్లెం వేస్తాడా..!

MATCH
మన్రో
undefined

ధోని పైనే దృష్టి...

ప్రస్తుత భారత జట్టులో అత్యంత అనుభవం ఉన్న ఆటగాడు ధోని. మైదానంలో ధోని సలహాలకు చాలా విలువుంది. బ్యాటింగ్​లోనూ తాను జట్టుకు ఎంత విలువైన ఆటగాడో ఆస్ట్రేలియాతో సిరీస్​లో ధోని నిరూపించాడు. వికెట్ల పతనాన్ని ఆపడంలో ధోనిది అందెవేసిన చెయ్యి. న్యూజిలాండ్ వన్డే సిరిస్​న 4-1తో భారత్ గెలుపొందితే టీ-20 సిరిస్​కు ఉత్సాహంగా అడుగుపెట్టొచ్చు.

MATCH
ధోని
undefined

స్వింగ్​ బౌల్ట్​ స్వింగ్...

పిచ్ ఏ మాత్రం సహకారించినా బౌల్ట్​ బౌలింగ్​ తీరే వేరు. నాలుగో వన్డేలో భారత్​కు ఇది తెలుసొచ్చింది. ఆ మ్యాచ్​లో ఐదు వికెట్లు తీసి తన స్వింగ్​ బలం చూపించాడు. ఐదవ వన్డేకు వేదికైనా వెస్ట్​పేక్​ మైదానం స్వింగ్​కు సహకరించే అవకాశం ఉంది.

MATCH
బౌల్ట్​
undefined

శుభమన్​గిల్​కు మరో అవకాశం...

ప్రపంచకప్​కు ముందు యువ ఆటగాళ్లకు వీలైనన్ని అవకాశాలు ఇవ్వాలని భారత్​ ఆలోచిస్తోంది. సారథి కోహ్లి గైర్హాజరీలో యువతేజం శుభమన్​గిల్​కు మరో అవకాశం దక్కనుంది. గత మ్యాచ్​ నిరాశ నుంచి అంబటి రాయుడు, కేదార్​ జాదవ్, దినేశ్​ కార్తీక్​ వేగంగా కోలుకోవాల్సి ఉంది. శిఖర్​ ధావన్​, రోహిత్ శర్మ ఓపెనింగ్ శుభారంభంపై మరోసారి దృష్టి సారించాలి. భువనేశ్వర్​ కుమార్​కు విశ్రాంతినిచ్చి షమీని ఆడించే అవకాశం ఉంది. ఖలీల్​ అహ్మద్​ స్థానంలో సిరాజ్​ను తుది జట్టులోకి తీసుకునే వీలుంది.

MATCH
ఖలీల్, సిరాజ్
undefined

ప్రపంచకప్​కు ముందు ప్రతికూలతలు...

వన్డే సిరీస్​ అనంతరం జరగనున్న మూడు మ్యాచ్​ల టీ-20 సిరీస్​, ప్రపంచకప్​కు ముందు భారత్​ తన బ్యాటింగ్ లోపాలను​ అధిగమించాలి. స్వింగ్​కు సహకరించే ఇంగ్లాండ్​ పిచ్​ల మీదే ప్రపంచకప్​ జరగనుంది.

జోరుగా కివీస్..

మొదటి మూడు వన్డేల్లో నిరాశ పరిచినప్పటికీ నాలుగోవన్డేలో కివీస్ అనూహ్యంగా పుంజుకుంది. ఓపెనర్​ గప్తిల్ వెన్నునొప్పి కారణంగా చివరి మ్యాచ్​కు దూరమయ్యాడు.
సానుకూలతలు

⦁ టేలర్​ ఫామ్​
⦁ నికోల్స్​ ఓపెనింగ్
⦁ బౌల్ట్​ బౌలింగ్

జట్లు

భారత్​: రోహిత్​ శర్మ (కెప్టెన్), శిఖర్​ ధావన్, ఎం.ఎస్​. ధోనీ (కీపర్), అంబటి రాయుడు, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, కుల్​దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, షమీ, చాహల్, శుభ్​మన్ గిల్, ఖలీల్ అహ్మద్, సిరాజ్, జడేజా, విజయశంకర్.

న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), ఆసిల్, బౌల్ట్​, గ్రాండ్​హూమ్​​, ఫెర్గ్యుసన్, హెన్రీ, లాథమ్ (కీపర్), మన్రో, జేమ్స్​ నీషమ్, నికోల్స్​, శాంట్నర్, సోధీ, టేలర్.

New Delhi, Feb 02 (ANI): While talking about Congress president Rahul Gandhi's remark on Interim Budget 2019, Union Minister for Minority Affairs said, "Rahul Gandhi should learn the difference between farmers and farming. He should know difference between 'baigan' and 'burger'. Until and unless he will not understand these differences, he will not understand the problem of farmers".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.