Nobel Prize in Chemistry 2024 : రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది నోబెల్ బహుమతి వరించింది. ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకుగానూ శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసబిస్, జాన్ ఎం.జంపర్‌ను ప్రతిష్టత్మక నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరక రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. కంప్యుటేషనల్ ప్రొటీన్ డిజైన్‌కుగానూ బెకర్, ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్‌కు గానూ డెమిస్, జంపర్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
గత ఏడాది నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణ, అభివృద్ధికిగాను ముగ్గురు శాస్త్రవేత్తలను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన మౌంగి బవెండి(62), లూయిస్ బ్రూస్(80), అలెక్సీ ఎకిమోవ్(78)క 2023కి నోబెల్ బహుమతిని స్వీడెన్లోని స్టాక్‌హోమ్‌లో జరిగిన కార్యక్రమంలో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెన్స్ ప్రకటించింది. నానో పార్టికల్స్, క్వాంటమ్ డాట్‌లను LED లైట్లు, టీవీ స్ర్కీన్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. క్యాన్సర్ కణజాలాన్ని తొలగించేందుకు సర్జన్‌లకు మార్గనిర్దేశం చేయడానికి ఈ సాంకేతికతనే వినియోగిస్తున్నారు.
ఈ ఏడాది వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14వరకు కొనసాగనుంది. సోమవారం వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించగా, మంగళవారం భౌతికశాస్త్రంలో నోబెల్ అవార్డులను ప్రకటించారు. బుధవారం కెమిస్ట్రీలో నోబెల్‌కు పురస్కారానికి ఎంపికైన వారి జాబితా వెలువరించింది రాయరల్ స్వీడిష్ అకాడమీ. గురువారం సాహిత్యం విభాగానికి, శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను పేర్లను ప్రకటిస్తారు.
స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా, 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. నోబెల్ అవార్డు గ్రహీతలకు 11లక్షల స్వీడిష్ క్రోనర్ (10లక్షల డాలర్లు) నగదు అందుతుంది. డిసెంబర్ 10న నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందిస్తారు.
మెషీన్ లెర్నింగ్‌కు బాటలు వేసిన శాస్త్రవేత్తలకు ఫిజిక్స్‌లో నోబెల్