ETV Bharat / sports

ధోనీ క్రికెట్ ప్రయాణంలో ఆ సంఖ్యలే కీలకం - धोनी के जीवन में लकी नंबर का महत्व

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్​లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. అయితే తన క్రికెట్ ప్రయాణంలో అతడికి కొన్ని నంబర్లు కలిసొచ్చాయి. ఆ సంఖ్యలేంటో చూద్దాం.

xcv
bcvb
author img

By

Published : Jul 7, 2020, 4:24 PM IST

మహేంద్ర సింగ్​ ధోనీ.. క్రికెట్​ ప్రపంచంలో టీమ్​ఇండియా ఖ్యాతిని ఒక వెలుగు వెలిగించిన క్రికెటర్. భారత జట్టుకు సారథిగా వ్యవహరించిన మహీ.. మ్యాచ్​పై ఆశలు వదులుకున్న చాలా సందర్భాల్లో ఆదుకుని జట్టును గెలుపు వైపు నడిపించాడు. మైదానంలో నిశ్శబ్దంగా ఉంటూనే.. కనుసైగలతో మ్యాచ్​ను నడిపించగల సత్తా ఉన్న వ్యక్తి. ఏ దేశ ఆటగాడితోనైనా ఇట్టే కలిసిపోయి, సన్నిహితుడిలా మెలుగుతాడు. అందుకే, ధోనీ బ్యాటింగ్​ స్టైల్​ తోపాటు, అతని వ్యక్తిత్వానికి వీరాభిమానులు ఉన్నారు. అయితే, యాదృచ్ఛికమో.. మరింకేదో కానీ, ధోనీ కెరీర్​లో నంబర్​ ప్రధాన పాత్ర పోషించింది. అతని తొలి గెలుపు దగ్గర నుంచి.. 2011 ప్రపంచ కప్​ కైవసం వరకు అంకె కీలకంగా నిలిచింది. అసలు ఈ సంఖ్య ప్రాధాన్యమేంటో ఓ లుక్కేద్దాం రండి.

ధోనీ క్రికెట్​ ప్రారంభం..

ధోనీ గురించి మొదట తెలుసుకోవాలంటే మనం 15 సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి. 2005లో పాకిస్థాన్​తో జరిగిన వన్డే సిరీస్​లో.. మహీ తొలి సెంచరీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమ్​ఇండియా తరఫున మూడో స్థానంలో బరిలోకి దిగిన ధోనీ.. 123 బంతుల్లో 148 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్​లో భారత్​ ఎంతో సునాయాసంగా గెలిచింది. అప్పటి నుంచి ధోనీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

Importance of Lucky numbers in mahendra singh Dhoni life
రాష్ట్రపతితో ధోనీ

ఆ నంబర్​ కీలకం..

ధోనీ జీవితంలో నంబర్​ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని అతనితో పాటు, ఆయన అభిమానుల నమ్మకం. ఇక మహీ లక్కీ నంబరు గురించి చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది నంబర్​.7. మహేందర్​ సింగ్​ మైదానంలో 7వ నంబర్ జెర్సీ ధరిస్తాడు. కారు నంబర్​ ప్లేట్​లోనూ 7వ అంకె ఉండాల్సిందే. అయితే, గంగూలీ 3వ స్థానం కూడా ధోనీకి ఎంతో ప్రత్యేకమైనది. ఈ నంబరే మహీని హీరోగా మార్చేసింది.

ధోనీ తన తొలి నాలుగు మ్యాచ్​ల్లో 0,12,7,3 పరుగులే సాధించాడు. ఆ తర్వాత అప్పటి కెప్టెన్​ గంగూలీ పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో మహీని మూడో స్థానంలో పంపాడు. అంతే, వచ్చే ఒక్కో బంతిని ధోనీ బౌండరీలు దాటిస్తుంటే.. అందరూ చూస్తుండిపోయారు. ఈ మ్యాచ్​లోనే కెరీర్​లో ధోనీ తొలి సెంచరీ సాధించాడు. అనంతరం దాదా వెళ్లిపోయాక అతడు కొంతకాలం మూడోస్థానంలో కొనసాగాడు.

ధోనీ

అత్యధిక పరుగులు

శ్రీలంకతో 2005లో జరిగిన వన్డే సిరీస్​.. ధోనీ కెరీర్​ను పూర్తిగా మార్చేసింది. ఓ మ్యాచ్​లో మహీ ఆకలితో ఉన్న పులిలా విరుచుకుపడి.. బౌలర్లకు చెమటలు పట్టించాడు. అలా తన వన్డే కెరీర్​లో అత్యధికంగా 183 పరుగులు సాధించాడు.

యాదృచ్ఛికమో.. ఇంకేదో కానీ, గంగూలీ మూడో స్థానంలో కొనసాగినప్పటి నుంచి దూసుకుపోయాడు ధోనీ. ఆశ్చర్యం ఏమిటంటే దాదా కెరీర్​లో అత్యధిక పరుగులు కూడా 183. ఆ తర్వాత జట్టుకు కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టాడు మహీ. ఇక ప్రస్తుత టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ కూడా తన వన్డే కెరీర్​లో చేసిన అత్యధిక పరుగులు 183. ఇలా భారత జట్టుకు గొప్ప కెప్టెన్​లుగా పేరుగాంచిన ఈ ముగ్గురికి మూడో నంబర్​ ఎంతో కలిసొచ్చింది.

జట్టు సారథిగా..

2007 ప్రపంచకప్​లో టీమ్ఇండియా ఓటమి తర్వాత.. రాహుల్​ ద్రవిడ్​ కెప్టెన్సీని వదులుకున్నాడు. అనంతరం ధోనీ జట్టు సారథిగా వ్యవహరించాడు. వరల్డ్​ కప్ ముగిసిన వెంటనే నిర్వహించిన.. తొలి టీ20 ప్రపంచకప్​లో టీమ్​ను విజయం వైపు నడిపించాడు. ఆ సమయంలోనే అతనిలోని అసలైన నాయకుడు బయటపడ్డాడు.

వరల్డ్​ కప్​కు కీలకమైన మూడో స్థానం..

భారత క్రికెట్​ చరిత్రలో 1983 ప్రపంచకప్​ తర్వాత మైలురాయిగా నిలిచిన టోర్నీ 2011వరల్డ్​కప్​. ఈ టోర్నీలో శ్రీలంకతో జరిగిన ఫైనల్​ మ్యాచ్​ అందరికీ గుర్తుండే ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు.. 274 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన భారత్​... మొదట్లోనే సెహ్వాగ్​, సచిన్​ వంటి దిగ్గజ ఆటగాళ్లను కోల్పోయింది. అయితే, ఈ మ్యాచ్​లో మూడో స్థానంలో గౌతమ్​ గంభీర్​ను రంగంలోకి దింపాడు మహీ. గంభీర్​ సూపర్​ ఇన్నింగ్స్​తో మ్యాచ్​ను గెలుపు దిశగా నడిపించాడు. ఆ తర్వాత ఐదో స్థానంలో మైదానంలోకి అడుగుపెట్టిన ధోనీ చివరివరకు నిలబడి.. వచ్చిన బంతిని విడిచిపెట్టకుండా బౌండరీలను దాటించి 91 పరుగులతో నాకౌట్​గా నిలిచాడు. ఆ సమయంలో ఆటగాళ్ల స్థానాల్ని మార్చడంపై ధోనీ తీసుకున్న నిర్ణయమే.. 28 ఏళ్ల తర్వాత భారత్​ను ప్రపంచ విజేతగా నిలిపింది.

మూడో స్థానానికి దూరం.. ట్రోఫీ వైఫల్యం

2014లో టెస్టులకు ధోనీ రిటైర్మెంట్​ ప్రకటించిన అనంతరం.. కోహ్లీ జట్టుకు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. 2019 ప్రపంచకప్​లో మూడో స్థానంలో ఆడే అవసరం వచ్చినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆ నంబర్​లో కొనసాగలేదు. ఈ టోర్నీలో మహీ ఏడో స్థానంలో బరిలో దిగాడు. అయితే, ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టీమ్​ఇండియా అభిమానులకు ఈ మెగాటోర్నీ నిరాశనే మిగిల్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.