ETV Bharat / sports

తీరంలో నేడే సమరం - మ్యాచ్

కంగారూలతో భారత్​కు 'ఖేల్' కొత్త కాదు. ఆసీస్​ను ఎదుర్కొవడం పెద్ద సమస్య కాదు..అయినా....ఆస్ట్రేలియాతో ఆడనున్న ఈ సిరీస్​పై అంచానాలు చాలా ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్​కు ముందు ఆడనున్న సిరీస్​ కావడమే ఇందుకు కారణం. భారత జట్టుకు వరల్డ్ కప్​లో రెండు బెర్తులు కన్​ఫమ్​ చేసేది ఆసీస్​తో సమరమే.

match
author img

By

Published : Feb 24, 2019, 8:14 AM IST

Updated : Feb 24, 2019, 8:32 AM IST

ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సమరానికి కోహ్లిసేన సిద్ధమైంది. ముందు రెండు టీ 20 ల సిరీస్‌లో భాగంగా నేడు విశాఖపట్నంలో తొలి మ్యాచ్‌ జరగనుంది. సొంతగడ్డపై ఆడుతుండటంతో టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య దూరమైనా...కోహ్లి చేరిక...బలం కానుంది. ఓపెనెర్లు రోహిత్, ధావన్​ల జోడికి తిరుగులేదు. ధోని కూడా మునుపటి ఫామ్​ను కొనసాగిస్తున్నాడు. ఆల్ రౌండర్లు విజయ్ శంకర్, కృనాల్ పాండ్య బ్యాటింగ్​లో ఆకట్టుకుంటుండం జట్టుకు కలిసొచ్చేదే.
బౌలింగ్ పదునుగా...
టీ 20 సిరీస్‌కు పేసర్‌ భువనేశ్వర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చినా.. భారత బౌలింగ్‌ బలంగానే కనిపిస్తోంది. బుమ్రా, ఉమేశ్‌, కౌల్‌, చాహల్‌లతో బౌలింగ్‌ విభాగం పటిష్టంగానే ఉంది. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో కంగారూలను చాహల్‌ ముప్పుతిప్పలు పెట్టాడు. సొంతగడ్డపై అతడు మరింత ప్రభావం చూపడం ఖాయం.
ఆశల ఆసీస్​
సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉంది ఆసీస్. మరోవైపు ప్రపంచకప్‌ కోసం జట్టులో చాలా స్థానాలకు ఆటగాళ్లను ఖరారు చేసుకోవాలి. ఆసీస్​కు జట్టులో భర్తీ చేయాల్సిన స్థానాలు చాలానే ఉన్నాయి. కెప్టెన్‌ ఫించ్​తోపాటు కొంతమంది ఆటగాళ్లు నిలకడ అందుకోవాల్సి ఉంది. బ్యాటింగ్‌లో షార్ట్‌.. బౌలింగ్‌లో జే రిచర్డ్‌సన్​ పై భారీ ఆశలు పెట్టుకుంది కంగారూ జట్టు. భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ఆసీస్‌కు పెద్ద సవాలే.

Bhopal (Madhya Pradesh), Feb 24 (ANI): Speaking at a gathering of Bharatiya Janata Party (BJP) workers in Bhopal on Saturday, BJP's General Secretary Kailash Vijayvargiya spoke on Surendra Nath Singh who is defeated by Congress' Arif Masood in assembly polls. Vijayvargiya said, "I am surprised that there is a nationalist government (BJP government in Madhya Pradesh) that stops cow slaughter, but a beef-eater wins against you. It's a matter of shame for all of us." While on the other side Congress MLA Arif Masood defended himself and said, "We never supported anyone who was involved in cow slaughter. I believe in uniting people and they (BJP) believe in dividing society."
Last Updated : Feb 24, 2019, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.