దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్.. అభిమానుల్ని పలకరించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, '1983 ప్రపంచకప్' సభ్యుల్ని కలవాలని అనుకుంటున్నట్లు వీడియోలో చెప్పారు.
కపిల్‌కు గత గురవారం గుండెపోటు రావడం వల్ల యాంజియోప్లాస్టీ చేశారు. అనంతరం ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు ఓ వీడియోను పోస్ట్ చేశారు.
-
Kapil Paaji’s back with love and gratitude for all of you @therealkapildev pic.twitter.com/eCOZpY5DmV
— Vikrant Gupta (@vikrantgupta73) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kapil Paaji’s back with love and gratitude for all of you @therealkapildev pic.twitter.com/eCOZpY5DmV
— Vikrant Gupta (@vikrantgupta73) October 29, 2020Kapil Paaji’s back with love and gratitude for all of you @therealkapildev pic.twitter.com/eCOZpY5DmV
— Vikrant Gupta (@vikrantgupta73) October 29, 2020
"మై ఫ్యామిలీ 83.. నేను మిమ్మల్ని త్వరగా కలవాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. నేను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సినిమా విడదుల ఎప్పుడో తెలియదు కానీ నేను మాత్రం మీ అందర్ని కలవాలనుకుంటున్నాను. ఈ ఏడాది చివరికి వచ్చేశాం. వచ్చే ఏడాది బాగానే ఉంటుందని ఆశిస్తున్నాను" -వీడియోలో కపిల్‌దేవ్
టీమ్ఇండియాకు 16 ఏళ్లపాటు ఆల్‌రౌండర్‌గా సేవలందించిన కపిల్ దేవ్.. ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా కొనసాగుతున్నారు. ఈయన క్రికెట్ కెరీర్లో 131 టెస్టులు, 225 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 5000 పరుగులు చేయడం సహా 400కు పైగా వికెట్లు తీశారు. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచారు.
కపిల్ బయోపిక్ '83'.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించారు. కరోనా ప్రభావంతో విడుదల వాయిదా పడుతూ వస్తోంది.