ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 కి సర్వం సిద్ధమయ్యింది. ఇప్పటికే జట్లతో పాటు సభ్యుల వివరాలను వెల్లడించిన బీసీసీఐ తాజాగా ప్రీమియర్ లీగ్ మస్కట్‌ను ఆవిష్కరించింది. 'శక్తి' అనే ఓ పులి బొమ్మను మస్కట్‌గా తెలుపుతూ బీసీసీఐ సెక్రటరీ జై షా ఓ వీడియోను రిలీజ్ చేశారు. 'శక్తి రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రారంభం మాత్రమే' అని రాసుకొచ్చారు. బ్లూ కలర్ జెర్సీ వేసుకున్న ఆ అందాల పులి బొమ్మ క్రికెట్ బ్యాట్ చేతబట్టి స్టేడియంలో విజృంభించింది. డబ్ల్యూపీఎల్‌కు ఈ మస్కట్ మరింత వన్నె తెచ్చింది. కాగా క్రికెట్ చరిత్రలో తొలిసారి మహిళల ప్రీమియర్ లీగ్ జరగనుంది.
ముంబయి వేదికగా మార్చి 4 నుంచి 26 వరకు జరగనున్న ఈ తొలి సీజన్ కప్ కోసం ఐదు జట్లు తలపడనున్నాయి. ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్‌తో పాటు దిల్లీ కెపిటెల్స్.. ఈ ఐదు జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. ఇక మొదటి మ్యాచ్‌లో ముంబయి- అహ్మాదాబాద్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ వేదికల కోసం ముంబయితో పాటు అహ్మదాబాద్, దిల్లీ, బెంగళూరు, లఖ్నవు నగరాలను ఎంపిక చేసింది బీసీసీఐ. కాగా ఈ సీజన్ మీడియా హక్కులను బీసీసీఐరూ. 951 కోట్లకు విక్రయించింది.
అహ్మదాబాద్‌ను గౌతమ్ అదానీకి చెందిన అదానీ స్పోర్ట్స్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్.. రూ.1289 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ముంబయి ఫ్రాంచైజీని ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.912 కోట్లకు దక్కించుకుంది. ఆర్సీబీ టీమ్‌ను రాయల్ ఛాలేంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.901 కోట్లకు దక్కించుకుంది. దిల్లీ ఫ్రాంచైజీని జే ఎస్ డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.810 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక లక్నో టీమ్‌ను కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.757 కోట్లకు సొంతం చేసుకుంది.
మరో వైపు ఇటీవలే ఈ సీజన్ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది బీసీసీఐ. ఉత్తేజకరంగా ఉన్న ఈ థీమ్ సాంగ్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆకట్టుకుంది . 'యే తో బాస్ షురత్ హై' అంటూ సాగే ఈ పాట, క్రీడారంగంలో శిఖరాగ్రానికి చేరుకోవడానికి అనేక అడ్డంకులను అధిగమించిన భారత మహిళా క్రికెటర్ల స్థైర్యంతో పాటు దృఢ సంకల్పానికి చిహ్నంగా ఈ పాటను రూపొందించినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.
-
Fast, fierce and full of fire! She's ready to set the field ablaze, lekin #YehTohBasShuruatHai !
— Jay Shah (@JayShah) March 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Introducing the embodiment of the #TATAWPL our mascot #Shakti ! @BCCI @BCCIWomen @wplt20 @viacom18#WPL2023 #WomensPremierLeague pic.twitter.com/oZcKm7aGwq
">Fast, fierce and full of fire! She's ready to set the field ablaze, lekin #YehTohBasShuruatHai !
— Jay Shah (@JayShah) March 2, 2023
Introducing the embodiment of the #TATAWPL our mascot #Shakti ! @BCCI @BCCIWomen @wplt20 @viacom18#WPL2023 #WomensPremierLeague pic.twitter.com/oZcKm7aGwqFast, fierce and full of fire! She's ready to set the field ablaze, lekin #YehTohBasShuruatHai !
— Jay Shah (@JayShah) March 2, 2023
Introducing the embodiment of the #TATAWPL our mascot #Shakti ! @BCCI @BCCIWomen @wplt20 @viacom18#WPL2023 #WomensPremierLeague pic.twitter.com/oZcKm7aGwq
-
Jaagi hui shakti ab mere paas hai,
— Women's Premier League (WPL) (@wplt20) March 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Dekho abhi, yeh toh bas shuruat hai!
Sing along to the anthem lyrics video and don't forget to tune in to the #TATAWPL from the 4th of March, live on @Sports18 and @JioCinema!#YeTohBasShuruatHai #WomensPremierLeague #WPL2023 pic.twitter.com/uwaSdJtkaA
">Jaagi hui shakti ab mere paas hai,
— Women's Premier League (WPL) (@wplt20) March 1, 2023
Dekho abhi, yeh toh bas shuruat hai!
Sing along to the anthem lyrics video and don't forget to tune in to the #TATAWPL from the 4th of March, live on @Sports18 and @JioCinema!#YeTohBasShuruatHai #WomensPremierLeague #WPL2023 pic.twitter.com/uwaSdJtkaAJaagi hui shakti ab mere paas hai,
— Women's Premier League (WPL) (@wplt20) March 1, 2023
Dekho abhi, yeh toh bas shuruat hai!
Sing along to the anthem lyrics video and don't forget to tune in to the #TATAWPL from the 4th of March, live on @Sports18 and @JioCinema!#YeTohBasShuruatHai #WomensPremierLeague #WPL2023 pic.twitter.com/uwaSdJtkaA