ETV Bharat / sports

టీ20 కెప్టెన్సీలో మార్పు.. మరి టెస్టుల సంగతేంటి? - అజింక్యా రహానె

ఇటీవలే టీ20 జట్టుకు కొత్త కెప్టెన్​ను ఎంపిక చేసిన బీసీసీఐ.. టెస్టు కెప్టెన్సీ విషయంలో (Team India New Captain) నూతన సారథ్యం గురించి ఆలోచిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు రోహిత్, రహానె పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి.

new captain for team india
టీ20 కెప్టెన్సీలో మార్పు.. మరి టెస్టుల సంగతేంటి?
author img

By

Published : Nov 11, 2021, 3:06 PM IST

టీ20 ప్రపంచకప్​లో వైఫల్యం చెందిన టీమ్ఇండియా.. టీ20 జట్టు ఇకపై నూతన నాయకత్వంలో అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే టీ20 జట్టు కెప్టెన్​గా (Team India New Captain) రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్​గా కేఎల్ రాహుల్​ను నియమించింది బీసీసీఐ. దీంతో టెస్టు సారథ్యంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒకవేళ కోహ్లీ టెస్టు కెప్టెన్​గా తప్పుకొంటే ఎవరికి పగ్గాలు అప్పజెప్పాలనే (Team India New Captain) విషయంపై బీసీసీఐకి ఓ స్పష్టత లేదని తెలుస్తోంది. టీ20 కెప్టెన్​గా రోహిత్​కు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో టెస్టు సారథ్యమూ అతడికే ఇవ్వాలని కొందరు అంటుండగా.. మరికొందరు రహానే పేరును వినిపిస్తున్నారు.

త్వరలోనే న్యూజిలాండ్ టీ20 సిరీస్ తర్వాత రెండు టెస్టుల్లో తలపడనుంది టీమ్ఇండియా. ఈ పర్యటనలోని టీ20 సిరీస్​కు​ కోహ్లీకి (Team India New Captain) విశ్రాంతినిచ్చారు. అయితే. మొదటి టెస్టుకూ అతడు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. దీంతో ఈ టెస్టుకు ఎవరు సారథ్యం వహిస్తారనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. ఇందులో రహానె, రోహిత్ ముందు వరుసలో ఉన్నారు.

రహానెకు అదే సమస్య

ఇప్పటికే టెస్టు జట్టులో రెగ్యులర్​గా ఆటగాడిగా ఉన్న రహానె.. కోహ్లీకి డిప్యూటీగా సేవలందిస్తున్నాడు. కానీ ఈ మధ్య బ్యాటింగ్​లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అలాగే బోర్డర్​-గావస్కర్ ట్రోఫీలో మెల్​బోర్న్​ టెస్టులో సెంచరీ చేసిన ఇతడు.. మిగతా అన్ని మ్యాచ్​ల్లో విఫలమయ్యాడు.

రోహిత్​కే అవకాశమా?

ఈ మధ్యే టీ20 జట్టు పగ్గాలు అందుకున్నాడు రోహిత్. కొంతకాలంగా టెస్టుల్లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో సెలెక్టర్లతో పాటు కొత్తగా ఎంపికైన ప్రధాన కోచ్ ద్రవిడ్ కూడా రోహిత్​ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడే టెస్టు కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ విషయంలో మార్పులు ఉండవని తెలుస్తోంది.

ఇదీ చూడండి : ఐపీఎల్​లో అదరగొట్టి.. టీమ్ఇండియాకు ఎంపికై!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.