మహిళల ఐపీఎల్ జట్ల వేలం పాట ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. ఓపెనింగ్ సీజన్లో పాల్గొననున్న ఐదు జట్లు రూ.4,669.99కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అహ్మదాబాద్ జట్టును అదానీ స్పోర్ట్స్ లైన్ రూ.1289 కోట్లు, ముంబయిని ఇండియా విన్ స్పోర్ట్స్ రూ.912.99కోట్లకు, బెంగళూరును రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ రూ.901కోట్లు, దిల్లీని జేఎస్ డబ్ల్యూ జీఎమ్ఆర్ క్రికెట్ రూ.810కోట్లు, లఖ్‌నవూను క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ రూ. 757కోట్లకు సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: ఆ ప్లేయర్స్‌కు ధోనీ డిన్నర్ సర్ప్రైజ్.. పోలీసులు-ఫ్యాన్స్ మధ్య ఉద్రిక్తత..