Babar Azam Moves Sachin: ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్.. పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. వన్డే, టీ-20ల్లో వరల్డ్ నెం.1గా ఉన్న పాక్ సారథి.. తాజాగా ఆల్‌టైమ్ వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో రేటింగ్ పాయింట్లను పెంచుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌ను అధిగమించి 15వ స్థానంలో నిలిచాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు బాబర్. ఇదే క్రమంలో ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మరింత పదిలపర్చుకున్నాడు.
బాబర్ ఇదే రీతిలో ఆడితే.. ఆల్‌టైమ్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ అత్యధిక రేటింగ్ పాయింట్ల జాబితాలో టాప్-10లోకి దూసుకెళ్లే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సచిన్ 887 రేటింగ్ పాయింట్లతో ఇప్పుడు 16వ స్థానానికి పడిపోయాడు. బాబర్ అజామ్‌కు ప్రస్తుతం 891 పాయింట్లు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో వెస్టిండీస్ మాజీ దిగ్గజ బ్యాటర్ సర్ వివ్ రిచర్డ్స్ 935 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్-10లో ఉన్న ఏకైక భారత ఆటగాడు విరాట్ కోహ్లీనే. విరాట్ 911 రేటింగ్ పాయింట్లతో ఆరో ప్లేస్‌లో ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ముందుంది కోహ్లీనే కావడం విశేషం.
-
Babar Azam has moved up to 15th position in the ICC All-Time ODI Batting Rankings #Cricket pic.twitter.com/2T6HZTZhT4
— Saj Sadiq (@SajSadiqCricket) April 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Babar Azam has moved up to 15th position in the ICC All-Time ODI Batting Rankings #Cricket pic.twitter.com/2T6HZTZhT4
— Saj Sadiq (@SajSadiqCricket) April 6, 2022Babar Azam has moved up to 15th position in the ICC All-Time ODI Batting Rankings #Cricket pic.twitter.com/2T6HZTZhT4
— Saj Sadiq (@SajSadiqCricket) April 6, 2022
ప్రస్తుత పాక్ క్రికెటర్లలో అత్యంత నిలకడగా ఆడుతున్న ఆటగాడు బాబర్ మాత్రమే. 2019లో 20 ఇన్నింగ్స్‌ల్లోనే 1092 పరుగులు చేశాడు. 2020లో 3 వన్డేల్లో 221 రన్స్ చేశాడు. 2021లోనూ అదే ఫామ్ కొనసాగించాడు. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఆడిన 3 ఇన్నింగ్స్‌ల్లో 276 పరుగులతో ఉన్నాడు. త్వరలో పాకిస్థాన్.. వెస్టిండీస్, నెదర్లాండ్స్‌తో సిరీస్‌లు ఆడనుంది. అందులో బాగా ఆడితే.. వన్డే రేటింగ్ పాయింట్స్‌లో టాప్-10లోకి చేరడం పెద్ద కష్టమేమీ కాదు. పాక్ నుంచి టాప్-10లో ఇప్పటికే ఇద్దరు క్రికెటర్లు ఉన్నారు. జహీర్ అబ్బాస్ 931 పాయింట్లతో 2, జావేద్ మియాందాద్ 910 రేటింగ్ పాయింట్స్‌తో ఏడో స్థానంలో ఉన్నారు.
ఇవీ చూడండి: రాజస్థాన్ రాయల్స్‌కు షాక్.. టోర్నీ నుంచి స్టార్ బౌలర్ ఔట్