ETV Bharat / sports

'బాబర్‌ ఈజ్​ బ్యాడ్‌ కెప్టెన్‌'.. పాక్‌ వరుస ఓటములపై మండిపడ్డ అక్తర్​ - టీ20 ప్రపంచకప్​ పాకిస్థాన్​

టీ20 ప్రపంచకప్‌లో రెండు వరుస ఓటములతో సెమీస్‌ అవకాశాలను పాకిస్థాన్‌ సంక్లిష్టం చేసుకుంది. దీంతో ఆ జట్టు కెప్టెన్​ను లక్ష్యంగా చేసుకుని మాజీలు విరుచుకుపడుతున్నారు. పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌.. బాబర్‌ బ్యాడ్‌ కెప్టెన్‌ అంటూ మండిపడ్డాడు.

babar azam is a bad captain
babar azam is a bad captain
author img

By

Published : Oct 28, 2022, 11:59 AM IST

టీ20 ప్రపంచకప్‌లో మాజీ ఛాంపియన్‌ పాకిస్థాన్‌ ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. రెండు వరుస ఓటములతో సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఆ జట్టుపై.. మాజీలు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్‌ బాబర్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌.. బాబర్‌ బ్యాడ్‌ కెప్టెన్‌ అంటూ మండిపడ్డాడు.

'మీకు ఆటను అర్థం చేసుకోవడం ఎందుకు కష్టంగా ఉందో నాకు తెలియడం లేదు. మన టాప్‌, మిడిల్‌ ఆర్డర్‌తో మనం పెద్ద విజయాన్ని సాధించగలమని మళ్లీ చెబుతున్నాను. అయితే.. నిలకడగా గెలవలేకపోతున్నాము. పాక్‌ జట్టుకు బ్యాడ్‌ కెప్టెన్‌ ఉన్నాడు. తన ఆట తీరుతో పాక్‌.. ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. మనం ఇటీవల ఓడిన మ్యాచ్‌ల్లో నవాజే చివరి ఓవర్‌ వేశాడు' అని అక్తర్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో విశ్లేషించాడు.

ఆటతీరును ఎక్కడ మార్చుకోవాలో అక్తర్‌ సూచించాడు. 'వన్‌డౌన్‌లో బాబర్‌ బ్యాటింగ్‌కు రావాలి. షాహీన్‌ షా అఫ్రిది ఫిట్‌నెస్‌ మెరుగుపర్చుకోవాలి. కెప్టెన్సీ, మెనేజ్‌మెంట్‌ నిర్ణయాల్లో ప్రధాన లోపాలు ఉన్నాయి. మేం మీకు మద్దతుగా నిలుస్తాం.. కానీ, మీరు ఏ స్థాయి క్రికెట్‌ ఆడుతున్నారు?' అని ప్రశ్నించాడు.

గురువారం జరిగిన సూపర్‌-12 పోరులో మాజీ ఛాంపియన్‌ పాక్‌కు జింబాబ్వే షాకిచ్చింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా కొనసాగిన ఈ స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో పాక్‌ను ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక తొలి మ్యాచ్‌లో భారత్‌ చేతిలో పాక్‌ ఓడిన విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.