Ashes 2023 : క్రికెట్ హిస్టరీలో నోబాల్ వేయడం అనేది ఓ పెద్ద తప్పుగా భావిస్తారు. అలాంటి ఘోర తప్పిదమే ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ చేశాడు. అది కూడా సెంచరీ హీరో వికెట్ టేకింగ్ డెలివరీని నోబాల్‌గా వేసి దానికి తగ్గ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 81 ఓవర్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ఓవర్ రెండో బంతిని బ్రాడ్ అద్భుత ఇన్ స్వింగర్‌గా వేయగా.. ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
బంతిని ఏ మాత్రం అంచనా వేయకపోవడం వల్ల ఖవాజా మిడిల్ స్టంప్‌ను బంతి గీరాటేసింది. ఈ వికెట్‌తో ఇంగ్లాండ్ ఆటగాళ్లు మ్యాచ్ గెలిచినంత సంబరాలు చేసుకోగా.. ఖవాజా నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. సరిగ్గా అదే సమయంలో అంపైర్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఆ బంతిని నోబాల్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా ఆ సమయంలో స్టువర్ట్ బ్రాడ్ బాధ మాటల్లో చెప్పలేనిది.
Ashes 2023 no ball : ఈ విషయంపై అతడు అంపైర్‌తో వాదించినప్పటికీ ఫలితం లేకపోయింది. కానీ రిప్లేలో లైన్ ధాటినట్లు స్పష్టంగా కనిపిచింది. ఈ అవకాశంతో ఖవాజా కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. అప్పటికీ ఆసీస్ స్కోర్ 264/5 కాగా.. ఉస్మాన్ ఖవాజా 112 రన్స్ స్కోర్ చేశాడు. ఒక వేళ ఈ వికెట్‌ను డిక్లేర్ చేసి ఉంటే ఆసీస్ జట్టు 300 స్కోర్ చేసే లోపే ఆలౌటయ్యేది. ఇంగ్లాండ్‌కు భారీ ఆధిక్యం లభించడంతో పాటు గెలుపుకు మంచి అవకాశాలు లభించేవి. కానీ బ్రాడ్ చేసిన నోబాల్ తప్పిదం వల్ల ఆ జట్టు కొంపమునిగినంత పని అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
Eng Vs Aus Ashes 2023 : ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. యాషెస్ టెస్ట్‌లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆసక్తికరంగా సాగింది. తొలుత కాస్త నెమ్మదించిన ఆసీస్ ప్లేయర్లు ఆ తర్వాత ఊపందుకున్నారు. ఇక కంగారు జట్టు ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీతో బాది జట్టు స్కోర్ పెరిగేలా చేయగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 311/5తో మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీమ్ వద్ద 5 వికెట్లు ఉంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన లక్ష్యం చేరుకోవాలంటే వారికి ఇంకా 82 పరుగులు కావాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన ఘోర తప్పిదం వల్ల ఇప్పుడు గెలుపు ఏవరికి దక్కుతుందో అన్న ఆసక్తి క్రికెట్ లవర్స్‌లో నెలకొంది.
-
Drama at Edgbaston as Usman Khawaja survives 🍿
— Sony Sports Network (@SonySportsNetwk) June 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
How much could this no-ball impact the result of the match? #SonySportsNetwork #RivalsForever #ENGvAUS #Ashes2023 pic.twitter.com/xswjeinVtA
">Drama at Edgbaston as Usman Khawaja survives 🍿
— Sony Sports Network (@SonySportsNetwk) June 17, 2023
How much could this no-ball impact the result of the match? #SonySportsNetwork #RivalsForever #ENGvAUS #Ashes2023 pic.twitter.com/xswjeinVtADrama at Edgbaston as Usman Khawaja survives 🍿
— Sony Sports Network (@SonySportsNetwk) June 17, 2023
How much could this no-ball impact the result of the match? #SonySportsNetwork #RivalsForever #ENGvAUS #Ashes2023 pic.twitter.com/xswjeinVtA