Asian Games Cricket 2023 : 2023 ఆసియా గేమ్స్‌లో క్రికెట్ సెమీఫైనల్ 1లో బంగ్లాదేశ్‌పై భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని.. భారత్ ఒక వికెట్ కోల్పోయి ఓవర్లలో 9.2 ఛేదించింది. తిలక్ వర్మ (55* పరుగులు : 26 బంతుల్లో, 2x4, 6x6) తుఫాన్ ఇన్నింగ్స్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేయగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (40* పరుగులు : 26 బంతుల్లో) రాణించాడు. బంగ్లా బౌలర్లలో రిపోన్ మోండల్ (26/1) ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో భారత్ ఓ పతకం ఖాయం చేసుకుంది. ఇక శుక్రవారం రెండో సెమీఫైనల్స్‌లో పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. ఇందులో విజేతతో భారత్.. శనివారం గోల్డ్‌మెడల్ కోసం పోటీ పడనుంది.
జైశ్వాల్ డకౌట్.. గత మ్యాచ్‌లో నేపాల్‌పై సెంచరీ సాధించిన యంగ్‌స్టార్ యశస్వి జైస్వాల్.. ఈసారి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అతడు తొలి ఓవర్లోనే.. క్యాచ్ ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం తిలక్ వర్మ.. బంగ్లా బౌలర్లను ఓ ఆట ఆడేసుకున్నాడు. తిలక్ హాఫ్ సెంచరీలో (55).. బౌండరీల ద్వారానే 44 పరుగులు వచ్చాయంటే అతడి విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో అర్థం చేసుకోవచ్చును. మరోవైపు అతడికి రుతురాజ్ తోడయ్యాడు. వీరిద్దరూ స్కోర్ బోర్డును జెట్ స్పీడ్‌లో పరుగులు పెట్టించారు.
అంతకుముందు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం సంపాదించారు. అర్ష్‌దీప్ ఒక్కడినే ప్రధాన పేసర్‌గా తీసుకున్నప్పటికీ స్పిన్నర్లు సాయి కిశోర్ (3/12), వాషింగ్టన్ సుందర్ (2/15) కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. వారిద్దరితోపాటు షహబాజ్, రవి బిష్ణోయ్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ తలో వికెట్ తీశారు. దీంతో బంగ్లా ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఇక బంగ్లా 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ పర్వేజ్ (23)తోపాటు లోయర్ ఆర్డర్‌లో జాకెర్ అలీ (24*), రకీబుల్ (14) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.
-
Team India achieved 97 runs in just 9.2 overs and advanced to the final of Men's Cricket event at Hangzhou Asian Games.#Hangzhou #AsianGames #Cricket #TeamIndia #TeamBangladesh #HangzhouAsianGames #AsianGames2023 @ICC @ACCMedia1 @WeAreTeamIndia @BCBtigers @BCCI pic.twitter.com/SkP3V1WjUj
— 19th Asian Games Hangzhou 2022 Official (@19thAGofficial) October 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Team India achieved 97 runs in just 9.2 overs and advanced to the final of Men's Cricket event at Hangzhou Asian Games.#Hangzhou #AsianGames #Cricket #TeamIndia #TeamBangladesh #HangzhouAsianGames #AsianGames2023 @ICC @ACCMedia1 @WeAreTeamIndia @BCBtigers @BCCI pic.twitter.com/SkP3V1WjUj
— 19th Asian Games Hangzhou 2022 Official (@19thAGofficial) October 6, 2023Team India achieved 97 runs in just 9.2 overs and advanced to the final of Men's Cricket event at Hangzhou Asian Games.#Hangzhou #AsianGames #Cricket #TeamIndia #TeamBangladesh #HangzhouAsianGames #AsianGames2023 @ICC @ACCMedia1 @WeAreTeamIndia @BCBtigers @BCCI pic.twitter.com/SkP3V1WjUj
— 19th Asian Games Hangzhou 2022 Official (@19thAGofficial) October 6, 2023
-
🏏🇮🇳 Unstoppable India! 🇮🇳🏏
— SAI Media (@Media_SAI) October 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Our Men's Cricket Team has emerged victorious against Bangladesh in the the Semifinals, enters the FINAL at the #AsianGames2022! 🙌💥#TeamIndia's chase for glory continues, and we are rooting for the GOLD🤩🌟
All eyes are on the ultimate showdown!… pic.twitter.com/zcS5gJbK3x
">🏏🇮🇳 Unstoppable India! 🇮🇳🏏
— SAI Media (@Media_SAI) October 6, 2023
Our Men's Cricket Team has emerged victorious against Bangladesh in the the Semifinals, enters the FINAL at the #AsianGames2022! 🙌💥#TeamIndia's chase for glory continues, and we are rooting for the GOLD🤩🌟
All eyes are on the ultimate showdown!… pic.twitter.com/zcS5gJbK3x🏏🇮🇳 Unstoppable India! 🇮🇳🏏
— SAI Media (@Media_SAI) October 6, 2023
Our Men's Cricket Team has emerged victorious against Bangladesh in the the Semifinals, enters the FINAL at the #AsianGames2022! 🙌💥#TeamIndia's chase for glory continues, and we are rooting for the GOLD🤩🌟
All eyes are on the ultimate showdown!… pic.twitter.com/zcS5gJbK3x
Asian Games 2023 India Medals : భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు.. రజతం, కాంస్య పతకాలు కూడా