Ashes series 2023 : యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ప్రస్తుతం రెండో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. అయితే ఉత్కంఠగా సాగుతున్న ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఓ అరుదైన మార్క్‌ను అందుకున్నాడు. ఆస్ట్రేలియా టాప్-5 బౌలర్ల జాబితాలో చేరిపోయాడు. తాజా మ్యాచ్‌లో 2 వికెట్లు తీసి టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. 79 టెస్టుల్లో 315 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే అతడు మాజీ స్పీడ్‌స్టర్ మిచెల్ జాన్సన్‌ను అధిగమించాడు. మిచెల్ జాన్సన్.. 73 టెస్టుల్లో 313 వికెట్లు పడగొట్టిన సంగతి క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే.
mitchell starc wickets in test : ఇకపోతే ఈ లిస్ట్‌లో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా.. గ్లెన్ మెక్‌గ్రాత్ 124 టెస్టుల్లో 563 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. నాథన్ లయోన్ 122 టెస్టుల్లో 496 వికెట్లు తీయగా.. డెన్నిస్ లిల్లీ 70 టెస్టుల్లో 355 వికెట్లు పడగొట్టి ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ashes series aus vs eng : ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుంది. నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. కమిన్స్ (2/20), స్టార్క్ (2/40)ల దెబ్బకు ఓ దశలో 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయిన ఇంగ్లాండ్‌ను.. డకెట్ (50), స్టోక్స్ (29) ఆదుకున్నారు. ఈ జంట ఐదో వికెట్‌కు 69 పరుగులు నమోదు చేసింది. బెన్ డకెట్ , బెన్ స్టోక్స్ ప్రస్తుతం క్రీజులో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్ గెలవాలంటే ఆఖరి రోజు 257 పరుగుల అవసరం ఉంది. అలానే ఆస్టేలియాకు 6 వికెట్లు అవసరం.
ఇదీ చూడండి :
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్ 5 బ్యాటర్స్ వీరే!
వరల్డ్ కప్ హీరోకు అరుధైన వ్యాధి.. ఇకపై సెంచరీ కొట్టలేనంటూ ఎమోషనల్..