ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్.. టీ20ల్లో మనమే టాప్.. టెస్టులు, వన్డేల్లో ఇలా..

author img

By

Published : May 4, 2022, 12:53 PM IST

ICC Rankings India: ఐసీసీ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా సత్తా చాటింది. టీ20ల్లో తొలిస్థానాన్ని పదిలం చేసుకుంది. టెస్టుల్లో రెండు, వన్డేల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

icc rankings
icc rankings

ICC Rankings India: 2021-22 క్రికెట్ సీజన్ ముగిసిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి వార్షిక ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. రోహిత్ శర్మ సారథ్యంలో టీ20లో ఇటీవల వరుస విజయాలు నమోదు చేసిన టీమ్ఇండియా.. ర్యాంకింగ్​లో తొలి స్థానాన్ని పదిలం చేసుకుంది. టెస్టు ర్యాంకింగ్​లో రెండో స్థానంలో ఉంది. టెస్టుల్లో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్​లో ఉండగా.. ఇండియా తొమ్మిది పాయింట్లు తేడాతో రెండో ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఇక వన్డే ర్యాంకింగ్స్​లో న్యూజిలాండ్ తొలిస్థానం దక్కించుకుంది. భారత్ నాలుగో స్థానంలో ఉంది.

ICC Rankings 2022: టెస్టుల్లో ఆస్ట్రేలియా-ఇండియా మధ్య వ్యత్యాసం రెండు పాయింట్లే ఉండేది. అయితే, జనవరిలో జరిగిన యాషెస్ సిరీస్​లో ఇంగ్లాండ్​పై 4-0తో గెలవడం వల్ల.. ర్యాంకింగ్స్​లో దూసుకెళ్లింది. పాకిస్థాన్... ఇంగ్లాండ్​ను అధిగమించి ఐదో స్థానానికి చేరింది. మే 4 వరకు జరిగిన అంతర్జాతీయ మ్యాచ్​లను ర్యాంకింగ్స్ కోసం పరిగణలోకి తీసుకుంది ఐసీసీ. 2021లో ఇంగ్లాండ్- ఇండియా సిరీస్​లో భాగంగా వాయిదా పడిన చివరి టెస్టు ఫలితాన్ని సైతం ర్యాంకింగ్స్ కోసం పరిగణలోకి తీసుకోనున్నారు.

మూడు ఫార్మాట్లలో టాప్ 10లో ఉన్న జట్లు ఇవే...

icc rankings
టీ20 ర్యాంకింగ్స్
icc rankings
వన్డే ర్యాంకింగ్స్
icc rankings
టెస్టు ర్యాంకింగ్స్

ఇదీ చదవండి: లివింగ్​స్టోన్​ విధ్వంసం.. ఈ సీజన్​లోనే భారీ సిక్సర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.