ETV Bharat / sports

స్టార్ క్రికెటర్​కు తీవ్ర గాయాలు.. ఆ షో షూటింగ్​లో ప్రమాదం - Andrew Flintoff news

ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్​ ప్రమాదం బారిన పడ్డాడు. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తరలించారు.

Andrew Flintoff injured
స్టార్ క్రికెటర్​కు ప్రమాదం.. ఆ షో షూటింగ్​లో..
author img

By

Published : Dec 14, 2022, 10:59 AM IST

Updated : Dec 14, 2022, 1:10 PM IST

ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ప్రమాదానికి గురయ్యాడు. ఓ ఛానల్‌లో వచ్చే 'టాప్‌ గేర్' షో చిత్రీకరణ జరుగుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు అక్కడి వార్త సంస్థలు తెలిపాయి. దక్షిణ లండన్‌లో డన్‌ఫోల్డ్‌ పార్క్‌ ఎయిరోడ్రోమ్‌ వద్ద టెస్ట్‌ ట్రాక్‌ వద్ద షూటింగ్‌ సందర్భంగా తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. అయితే ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని వైద్యులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

45 ఏళ్ల ఆండ్రూ ఫ్లింటాఫ్ టీమ్‌ఇండియా క్రికెట్ అభిమానులకు సుపరిచితుడే. లార్డ్స్‌ వేదికగా జరిగిన నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌ పోరులో సౌరభ్‌ గంగూలీ, యువరాజ్‌తో వాగ్వాదానికి దిగిన సంఘటన ఎప్పటికీ మరువలేం. ఆ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించడంతో భారత కెప్టెన్‌ గంగూలీ చొక్కా విప్పి గింగరాలు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కైఫ్ (87*)తోపాటు యువీ (69) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక ఇంగ్లాండ్‌ తరఫున ఫ్లింటాఫ్ 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా దిగ్గజ క్రికెటర్‌గా ఎదిగాడు.

ఇదీ చూడండి: Fifa worldcup: మెస్సీ మ్యాజిక్​.. ఫైనల్​కు అర్జెంటీనా

Last Updated : Dec 14, 2022, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.