ETV Bharat / sports

ఖేల్​రత్న రేసులో కిదాంబి శ్రీకాంత్​ - Srikanth recommended for Khel Ratna

భారత బ్యాడ్మింటన్​ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్​ పేరును ప్రతిష్టాత్మక రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డుకు సిఫార్సు చేసింది భారత బ్యాడ్మింటన్​ సంఘం.

Srikanth recommended for Khel Ratna after apologising to BAI
ఖేల్​రత్న రేసులో కిదాంబి శ్రీకాంత్​
author img

By

Published : Jun 20, 2020, 8:14 AM IST

ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు భారత అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ పేరును భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) సిఫార్సు చేసింది. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన శ్రీకాంత్‌ క్షమాపణలు చెప్పగా.. బాయ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అర్జున అవార్డుకు తన పేరును సిఫార్సు చేయకపోవడం వల్ల బాయ్‌పై విమర్శలు గుప్పించిన ప్రణయ్‌కు షోకాజ్‌ నోటీసు జారీచేసింది.

Srikanth recommended for Khel Ratna after apologising to BAI
ఖేల్​రత్న

"ఫిబ్రవరిలో ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌ ఆడకుండా శ్రీకాంత్‌, ప్రణయ్‌లు వేరే టోర్నీ కోసం బార్సిలోనా వెళ్లారు. జట్టును వీడొద్దని చెప్పినా వినలేదు. దీంతో పతకం గెలిచే అవకాశం త్రుటిలో చేజారింది. బాయ్‌కు పంపిన ఈమెయిల్‌లో శ్రీకాంత్‌ తన తప్పు ఒప్పుకున్నాడు. భవిష్యత్తులో అలాంటి తప్పు చేయనని చెప్పాడు. ఎన్నో ఘనతలు సాధించిన శ్రీకాంత్‌ పేరును ఖేల్‌రత్న అవార్డుకు సిఫార్సు చేశాం. ప్రణయ్‌కు షోకాజ్‌ నోటీస్‌ పంపించాం. అతను స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం" అని బాయ్‌ కార్యదర్శి అజయ్‌ సింఘానియా తెలిపాడు. ఇటీవలే అర్జున కోసం సమీర్‌ వర్మ పేరును బాయ్‌ ప్రతిపాదించింది.

ఇదీ చూడండి:దాదా కుటుంబంలో కరోనా కలకలం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.