ETV Bharat / sitara

హాత్​వే రాజశేఖర్​ కన్నుమూత... ఎమ్​ఎస్​వోల సంతాపం - తెలంగాణ ఎంఎస్​వో అసోసియేషన్

కేబుల్ రంగంలో ఖ్యాతి గాంచిన వెంకటసాయి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత రాజశేఖర్.. గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం కేబుల్​ రంగానికి లోటుగా ఎమ్​ఎస్​వోలు అభిప్రాయపడ్డారు.

venkatasai media private limited owner rajashekhar died due to heart attack

author img

By

Published : Aug 29, 2020, 1:13 PM IST

Updated : Aug 29, 2020, 2:08 PM IST

హాత్‌వే డిజిటల్ కేబుల్‌ మాజీ డైరెక్టర్‌, వెంకటసాయి మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌ అధినేత చెలికాని రాజశేఖర్‌... గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కేబుల్​ టీవీ, బ్రాడ్ ‌బ్యాండ్ ‌ఇంటర్నెట్ సర్వీసుల రంగంలో... రాజశేఖర్ ‌సుదీర్ఘ కాలం సేవలు అందించారు.

చెలికాని రాజశేఖర్. హాత్‌వే రాజశేఖర్‌గా ఉమ్మడి రాష్ట్రంలోపేరు పొందిన ఆయన...కేబుల్ రంగంలో తనదైన ముద్ర వేశారు. 1968 ఏప్రిల్ 4న విజయనగరం జిల్లా సీతానగరంలో జన్మించారు. తొలిసారి విశాఖపట్నంలో కేబుల్ రంగంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ ‌కేంద్రంగా ఉన్న హాత్‌వే ను నలువైపులా విస్తరించారు. ఆ తర్వాతి కాలంలో వెంకట సాయి మీడియాను స్థాపించి రెండు రాష్ట్రాల్లో పెద్ద నెట్‌వర్క్‌గా నిలిపారు. కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం కోసం కృషిచేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎమ్​ఎస్​వోల అధ్యక్షుడిగా పనిచేశారు. ఎమ్​ఎస్​వోల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. ఆలిండియా బాల్ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. రాజశేఖర్ ‌మృతిపై బ్రైట్‌వే కమ్యూనికేషన్స్ ‌సంతాపం తెలిపింది. తెలంగాణ ఎమ్​ఎస్​వో అసోసియేషన్స్‌, తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్‌, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశాయి. రాజశేఖర్​ కుటుంబానికి ఈటీవీ సీఈవో బాపినీడు సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు.

Last Updated : Aug 29, 2020, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.