ETV Bharat / sitara

Manchu vishnu: జగన్‌, షర్మిల నాపై కోప్పడ్డారు! - మంచు విష్ణు ఇంటర్వ్యూ

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga) షోకు ఈ వారం హీరో మంచు విష్ణు(Manchu vishnu) అతిథిగా విచ్చేశారు. తన కెరీర్​, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతేడాది లాక్​డౌన్​ సమయంలో కుటుంబానికి దూరంగా ఉండటం.. అప్పుడు ఆయన పడిన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.

Manchu Vishnu Interview in Alitho Saradaga
Manchu vishnu: జగన్‌, షర్మిల నాపై కోప్పడ్డారు!
author img

By

Published : Aug 26, 2021, 1:11 PM IST

ఓ వైపు విభిన్న కథలతో హీరోగా రాణిస్తూనే.. మరోవైపు మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను నిర్మిస్తున్నారు నటుడు మంచు విష్ణు(Manchu vishnu). అలా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్న ఆయన ఇప్పుడు 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga) కార్యక్రమానికి విచ్చేశారు. 'ఈటీవీ'లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో విష్ణు చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం..

విష్ణు.. ఈ మధ్య మీ పేరు బాగా వినిపిస్తోంది.. ఏంటి సంగతి?

విష్ణు: నేనేం చేశాను. నా పని నేను చేస్తున్నానంతే. శ్రీను వైట్లతో చేస్తున్న సినిమా కోసం ఆయన దగ్గర తిట్లు తింటూనే ఉన్నాను. అది తప్ప ఎందుకు వినిపిస్తోందో మీరే చెప్పాలి.

మీడియా ఆడుకుంటోందిగా..?

విష్ణు: అయితే, నేను అదృష్టవంతుణ్ని అనే చెప్పాలి. అలా అయినా ఏదో కారణంతో నేను వార్తల్లో ఉన్నాను కదా!

తొలి లాక్‌డౌన్‌ సమయంలో నీ భార్యాబిడ్డలు అమెరికాలో ఉండిపోయారు. నువ్వు అటు వెళ్లలేక, వాళ్లు ఇటు రాలేక చాలా ఇబ్బంది పడ్డారు కదా. ఆ సమయంలో చాలా ఎమోషనల్‌గా ఓ వీడియో పెట్టావు ఎందుకని?

విష్ణు: ఆ సమయంలో నాకు చాలామంది ఫోన్‌ చేసి ఎలా ఉన్నావ్‌? ఏంటి? అని అడిగేవారు. అనివార్య కారణాల వల్ల కుటుంబంలో ఒకరికి చాలా పెద్ద క్యాన్సర్‌ సర్జరీ కోసం సింగపూర్‌కి వెళ్లాల్సి వచ్చింది. నాన్న, అమ్మ, నేను వెనక్కి వచ్చేశాం. భార్య విన్నీ, పిల్లలు అక్కడే ఉన్నారు. నాన్నను ఇక్కడ ఇంట్లో దింపి, నాన్న పుట్టినరోజు(మార్చి 19)ను విద్యానికేతన్‌లో నిర్వహించి.. 21న తిరిగి సింగపూర్‌ వెళ్లాలి. 23న లేదా 24న విన్నీని, పిల్లల్ని తీసుకురావాలి. సరిగ్గా అదే సమయంలో లాక్‌డౌన్‌ విధించారు. లక్కీ ఏంటంటే సింగపూర్‌లో ఫ్యామిలీ ఫ్రెండ్స్‌, తెలుగు వాళ్లు కొంతమంది ఉన్నారు. మరోవైపు ప్రపంచంలోనే సేఫెస్ట్‌ దేశాల్లో అదొకటి. దాంతో కాస్త ఓకే అనిపించింది.

అయితే, అక్కడ 15-20 రోజుల తర్వాత పరిస్థితి మారింది. విన్నీకి టెన్షన్‌ మొదలైంది. కేంద్ర ప్రభుత్వంలో తెలిసినవారిని కొంతమందిని వాకబు చేస్తే.. "లాక్‌డౌన్‌ మే ఆఖరి వరకు పొడిగించొచ్చు. దానికి తగ్గట్టు సిద్ధంగా ఉండండి.. మాకు ఇంకా ఎలాంటి స్పష్టత రావడం లేదు" అని చెప్పారు. అప్పుడు నాలో ఆందోళన మొదలైంది. మన దగ్గర ఎంత డబ్బున్నా.. సింగపూర్‌లో ఉండటం అంటే ఖర్చు చాలా ఎక్కువ. అదే సమయంలో మేలో ఒక ఆప్షన్‌ వచ్చింది. ఏదైనా ఫ్లైట్‌ బుక్‌ చేయగలిగితే.. నా కుటుంబాన్ని నేను వెనక్కి తీసుకొచ్చేయొచ్చని తెలిసింది. అప్పుడే నాకో విషయం అర్థం అయ్యింది. వందల కోట్లు, వేల కోట్ల ఆస్తులు ఉండే కన్నా.. చేతిలో ఒక రూ.20-30 లక్షలు ఉంటే అవి వందల కోట్లతో సమానం అని తెలుసుకున్నాను.

కానీ ఆ సమయంలో నా దగ్గర చేతిలో అవసరమైన డబ్బులు లేకపోవడం, 'మోసగాళ్లు' సినిమాకు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేసి చేతిలో లిక్విడ్‌ లేకపోవడం వల్ల కుటుంబాన్ని తీసుకురాలేకపోయాను. పాపం విన్నీ రోజూ ఇబ్బంది పడుతూ ఉండేది. తెలిసినవాళ్లు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పడం మొదలుపెట్టారు. అయితే కొంతమంది స్నేహితులు ఫోన్‌ చేసి "చాలామంది ఇలా ఇతర ప్రాంతాల్లో ఇరుక్కుని ఉన్నారు.. ఏదైనా ఒక ఎంకరేజ్‌మెంట్‌ వీడియో చెయ్‌" అని సూచించారు. దాంతో వీడియో రూపంలో నా భావాలను చెప్పాలనుకున్నాను. అలా ఆ వీడియో చిత్రీకరించినప్పుడు మూడు సార్లు ఏడ్చేశాను. ఆ తర్వాత "నేను ఏడవడం ఏంటి.." అనుకుని సముదాయించుకుని వీడియో చేశాను.

అయితే, ఈ విషయంలో నేను చాలామందికి ధన్యవాదాలు చెప్పాలి. గుడ్‌విల్‌ అంతా ఏదో ఒకరోజు పనికొస్తుందని చాలామంది అంటుంటారు. అది మరోసారి నిజమైంది. ముంబయిలో ఉన్న ఓ ఫ్రెండ్‌కు హోం శాఖలో తెలిసినవారు ఒకరున్నారు. వాళ్లను ఈ వ్యవహారంలో సాయం అడిగాం. వాళ్లు తెలుగువాళ్లు అవ్వడం, అందులోనూ వాళ్లు నాన్నకు అభిమానులు. ఇవన్నీ నాకు బాగా సాయపడ్డాయి. అయితే ఆ సమయంలో ప్రైవేటు ఫ్లైట్స్‌ను అనుమతించలేదు. కేవలం రెస్క్యూ ఫ్లైట్స్‌ను మాత్రమే అనుమతించారు. ఆ సమయంలో సింగపూర్‌ తెలుగు అసోసియేషన్‌ వాళ్లను సంప్రదించాను. 'నా కుటుంబం అక్కడ ఉండిపోయింది. కేవలం రెస్క్యూ ఫ్లైట్స్‌ మాత్రమే అనుమతిస్తామని అంటున్నారు. నేను కావాలంటే ఒక ఫ్లైట్‌ బుక్‌ చేస్తాను. ఎవరి దగ్గరైనా డబ్బులు లేకపోయినా ఫర్వాలేదు. నేనే డబ్బులు పెడతాను' అని అడిగాను. ఈ క్రమంలో ఫ్లైట్‌ ఇవ్వడానికి ఒకరు అనుమతించారు. అయితే హైదరాబాద్‌కు ఫ్లైట్స్ లేవు. ప్రాధాన్యం ప్రకారం అప్పటికి మనకు ఇంకా విమానాలు మొదలవ్వలేదు. దీంతో పరిస్థితి డ్రామాలాగా మారింది.

ఈ సమయంలో అసోసియేషన్‌ వాళ్లు చాలా సాయం చేశారు. అంతేకాదు నా తోటి నటీనటులు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నా పిలుపునకు వాళ్లంతా ముందుకొచ్చారు. మహేశ్‌బాబు, నితిన్‌, కళ్యాణ్‌రామ్‌ లాంటివాళ్లను అడిగాను. 'నా ప్రయత్నం వీలైనంత ఎక్కువమందికి చేరాలి. ఈ విషయం ట్వీట్‌ చేయండి' అని అడిగాను. అంతేకాదు ఈ విషయంలో సోనూ సూద్‌కూ ఫోన్‌ చేశాను. సాయం చేయాలని అడిగాను. అందువల్ల చాలామందికి అవేర్‌నెస్‌ పెరిగింది. అప్పుడు కొంతమందిని మాత్రమే సింగపూర్‌ నుంచి దేశానికి తీసుకురాగలిగాం. ఆ విమానం ఫుల్‌ అయ్యింది. మిగతావాళ్లు ఇంకా ఉన్నారు. ఆ తర్వాత మరో రెస్క్యూ ఫ్లైట్‌ కోసం సాయం చేశాను.

అసోసియేషన్లతో విదేశాల్లో చాలామంది సాయం చేస్తుంటారు.

విష్ణు: అసోసియేషన్ల పేరుతో అందరూ సాయం చేయడానికే ఉన్నారా అనేది నా ప్రశ్న. నాకు అర్థం కానిది ఏంటంటే.. 'మనం తెలుగువాళ్లం. అందరం కలిపి ఒకే అసోసియేషన్‌గా ఉంటే సరిపోతుంది కదా' అనిపిస్తుంటుంది. అందరికీ ఒక బలమైన అసోసియేషన్‌ ఉంటే సరి.

సేమ్‌ డైలాగ్‌ వాళ్లు అదే అనుకుంటే.. మన అసోసియేషన్‌ గురించి?

విష్ణు: మన అసోసియేషన్‌ టాపిక్‌ మీరు ఎత్తారు కాబట్టి చెబుతున్నా.. మనం ఒకటిగా ఉన్నాం.

'మీకే ఐకమత్యం లేదు.. మా గురించి మాట్లాడుతున్నారేంటి' అని ఇతర అసోసియేషన్లవాళ్లు అనుకుంటే..?

విష్ణు: దేవుడు ఒక్కడే అని మనుషులం మనమే ఇంకా కచ్చితంగా చెప్పలేం. అలాంటిది ఒక్క హీరో సరిపోతాడా. ఉన్న ఏడు కోట్లు మందికో, పది కోట్ల మందికో 20 మంది హీరోలు మేం ఉన్నాం. వందల కోట్లమందికి ఒక్క దేవుడు సరిపోడు. ఒక్కొక్కరూ ఒక దేవుడిని ఎన్నుకున్నాం. అలాగే నాకు తెలిసి అసోసియేషన్లు కూడా నాలుగైదు ఉన్నాయి. అలాగే మన అసోసియేషన్‌ కూడా ఐకమత్యంగా ఉంటే.. చాలా బాగుంటుంది.

ఆ ఛైర్‌లో మీరు కూర్చుంటే న్యాయం చేయగలరా?

విష్ణు: ఆ నమ్మకం ఉంది కాబట్టే.. నేను ఈసారి నిలబడుతున్నాను. నాకు తెలిసి ఇండస్ట్రీ ఇప్పటివరకూ డివైడ్‌ అవ్వలేదు. ఏదో ఐదారుగురు కుప్పిగంతులు వేస్తుంటే.. ఇండస్ట్రీ మొత్తం విడిపోయింది అనడం తప్పు. ఎన్నికల వల్ల విడిపోవడం, విడిపోతాం అనడం సరికాదు. అది అసాధ్యం కూడా. ఎన్నికలు కేవలం ఎన్నికలు మాత్రమే.

మంచు కుటుంబంలో పుట్టినందుకు గర్వపడుతున్నారా? బాధపడుతున్నారా?

విష్ణు: నాకు ఇది ఓ రకంగా ఆశీర్వాదం, మరో విధంగా పెద్ద సవాలు కూడా. నేను ఎంత చేసినా, ఎన్ని హిట్లు ఇచ్చినా అది మా నాన్న కాలి గోటితో సమానం కాదు. ఈ రోజుకీ మా నాన్న 'నేను రెండే రెండు చొక్కాలతో వచ్చాను. కారు షెడ్‌లో పడుకున్నా. ఒక పూట కూడా నేను తినడానికి తిండి దొరికేది కాదు' అని గర్వంగా చెప్పుకుంటారు. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఆయన దేశంలోనే లెజెండ్‌ నటీనటుల్లో ఒకరిగా ఎదిగారు. దేశంలో నటనా రంగంలో 15 -20 మంది లెజెండ్స్‌ ఉన్నారంటే.. అందులో నాన్న ఒకరు. ఈ మాటను ఎవరూ కాదనలేరు. నటుడిగా, పరోపకారిగా ఆయన ఓ స్థాయిలో నిలిచారు. అలాంటిది నేను ఏం చేస్తే.. ఆయన స్థాయికి చేరగలనా? అది అసాధ్యం. అందుకే నా దారి నేను వెతుక్కోవాలి. కానీ నాన్న ఉన్న రంగంలోనే నేను ఉంటూ, నన్ను నేను నిరూపించుకోవాలి అనుకునేది చాలా పెద్ద ఛాలెంజ్‌. మోహన్‌బాబు కొడుకుగా నాకు ఒక సినిమానో, రెండు సినిమాలోనో అవకాశం వస్తుంది. దాని తర్వాత నాకు ప్రతిభ ఉంటేనే కెరీర్‌ ఉంటుంది. లేకపోతే లేదు. టాలెంట్‌ ఉండబట్టే కదా నేను ఈ షోలో ఉన్నాను.(నవ్వులు)

నాన్న రాగానే లేవటం, గౌరవంగా చేతులు కట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. అది నిజమా.. లేక నటనా?

విష్ణు: నాన్నతో నేను, మనోజ్‌ ఇలానే ఉంటాం. అక్క అయితే వెరీ రిలాక్స్‌డ్‌. నాన్న వస్తే అక్క లేచి నిలబడదు. కాలి మీద కాలేసుకుని కూర్చుని, సోఫా మీద పడుకోవడం లాంటివి చేస్తుంటుంది. నేను, మనోజ్‌ అయితే నిద్రలో కూడా నాన్న ఫోన్‌ చేస్తే లేచి కూర్చుంటాం. మేం పెరిగిన వాతావరణం అలాంటిది. అందరి ఇళ్లలో అలా ఉండదు. రెండోది మనోజ్‌ విపరీతంగా అల్లరి చేసేవాడు. దెబ్బలు తినేవాడు కూడా. నాకూ మామూలుగా పడేవి కాదు. హ్యాంగర్లు, కర్రలు కూడా విరిగేవి. అక్క చేసిన పనుల్లో మేం పది శాతం చేస్తే చర్మం వలిచేస్తారు నాన్న. మా అక్క ఏమన్నా చేయొచ్చు. ఆవిడకి ఇంట్లో ఏమన్నా చెల్లుతుంది. మాకు అస్సలు చెల్లదు. (మధ్యలో ఆలీ కల్పించుకుంటూ 'కూతురంటే ప్రేమెక్కువ') ‘తండ్రికి కూతురు వీక్‌నెస్‌ అనేది పిల్లలు పుట్టిన తర్వాత నాకు అర్థమైంది.

అందుకోసమే పోటీ మీద నలుగురిని కన్నారా? కవలలు కావాలని ప్లాన్‌ చేసుకొని కన్నారా?

విష్ణు: (నవ్వులు) అది తలరాత. లేదు కావాలని ప్లాన్‌ చేసింది కాదు. వారసత్వంగా వచ్చింది. విన్నీవాళ్ల తాతగారికి కవలలున్నారు. ఆ తర్వాత మళ్లీ మాకు కవలలు కలిగారు.

అమ్మ ఎలా మీతో ఉంటుంది?

విష్ణు: అమ్మ అందరితో ఒకేలా ఉంటుంది. కానీ మనోజ్‌ పెట్టే టెన్షన్స్‌కు అమ్మ ఏటా రెండేళ్ల వయసు పెరిగిపోతోంది. మా అమ్మకు వయసైపోడానికి కారణం వాడే.

మీ ముగ్గురిలో ఎవరికి కోపమెక్కువ?

విష్ణు: అక్కకే ఎక్కువ.

మగాడిలా పుట్టాల్సింది. ఆడపిల్లగా పుట్టింది. ఒకవేళ లక్ష్మి నీకన్నా ముందు మగాడిలా పుడితే నీ పరిస్థితి ఏంటి?

విష్ణు: ఆడపిల్లగా పుట్టిందని మా నాన్న ఇంట్లో తేడా చూపించలేదు. చెప్తే కొత్తగా అనిపించొచ్చు కానీ, అక్కకున్న స్వేచ్ఛ నాకు లేదు. బహుశా ఎందులోనూ తేడా ఉండేది కాదు. క్రికెట్‌లో ఒక కెప్టెన్‌ మాత్రమే ఉండే వీలుంటుంది. మా ఇంట్లో మేమందరం ఒక్కొక్క కెప్టెన్‌. మేం చెప్పిందే జరగాలని అనుకుంటాం. అందుకే మేం ముగ్గురం కలిసి పని చేయలేదు.

కథ వినేటప్పుడు కచ్చితంగా విజయం సాధిస్తుందనుకున్న సినిమాలు ఎన్ని ఉంటాయి?

విష్ణు: సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే తీస్తాం. ఇది మీకు తెలియంది కాదు.

నమ్మకం కథ మీద? లేక దర్శకుడి మీద?

విష్ణు: ముందు కథ. తర్వాతే దర్శకుడు. కొన్ని సార్లు కథ బాగానే ఉంటుంది. కానీ దర్శకుడు మాయ చేస్తాడనే నమ్మకం వారిపైనా కూడా ఉంటుంది. నా జీవితంలో చేసిన పెద్ద తప్పిదాల్లో మంచి దర్శకులను ఎంచుకోకపోవడం ఒకటి. అందుకు నా అవివేకం ఒకటి. రెండోది నేను సెంటిమెంటల్‌ ఫూల్‌ని. దర్శకుడి ప్రతిభను నమ్మి ఫీల్డ్‌లోకి దిగుతాం. ఆ దర్శకుడు చెడగొడుతున్నాడు అని తెలిసిపోయాక బయటకు రాలేం. అలా మధ్యలోనే సినిమాలు ఆపేయాలనుకుంటే నాలుగు సినిమాలు విడుదలయ్యేవి కావు. అలాంటి సినిమాల్లో 'ఆచారి అమెరికా యాత్ర' యాత్ర ఒకటి. జి.నాగశ్వర్‌ రెడ్డి నాకు కథ చెప్పినప్పుడు విపరీతంగా నచ్చింది. అమెరికాలో షూటింగ్‌కు వెళ్లాక కథ మారింది. ఇదేదో తేడా కొడుతుందని అందరికీ చెప్పాను. ఆ సినిమాకు డబ్బులు కూడా పెట్టాను. సినిమా పోయింది, డబ్బులు ఎగ్గొట్టారు. ప్రతి హీరో పైకి ఎదగడానికి, కింద పడటాన్ని శుక్రవారం నిర్ణయిస్తుంది. అలా నేను చేసిన పెద్ద మిస్టేక్స్‌ నాలుగు శుక్రవారాలున్నాయి. జీవితం 360 డిగ్రీలు తిప్పింది. మీ భాషలో చెప్పాలంటే కాయకచోరీ అయిపోయింది.

కలెక్షన్‌కింగ్‌ అంటారు? అందులో 50 శాతానికి చేరుకోకపోవడానికి కారణం?

విష్ణు: నేను ముందే చెప్పాను కదా. నా కెరీర్‌లో చేసిన పెద్ద తప్పిదం.. సరైన దర్శకులను ఎంచుకోలేకపోవడం.

ఇకముందైనా ఆ జాగ్రత్త తీసుకోబోతున్నావా?

విష్ణు: ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండకుంటే నాకన్న పెద్ద ఫూల్‌ ఎవరూ ఉండరు. తర్వాత శ్రీనువైట్లతో 'ఢీ అండ్‌ ఢీ' తీస్తున్నాం. రెండేళ్లుగా అనుకుంటున్న సినిమా అది. త్వరలోనే మొదలుపెట్టబోతున్నాం. క్యాస్టింగ్‌ ఫన్నీగా ఉంటుంది. ఆ విషయాలు డైరెక్టర్‌గారు చెబితేనే బాగుంటుంది.

విన్నీని మొదటిసారి చూసిందెక్కడ?

విష్ణు: వాళ్లింట్లోనే చూశాను. ఆ అమ్మాయి నవ్వు, ప్రవేశం ద్వారం వద్ద ఆమె నిలబడిన తీరు. ఈ రోజు తలుచుకున్నా, అదంతా నిన్న జరిగినట్లే అనిపిస్తుంది. అదో అందమైన ఫీలింగ్‌.

చెప్పగానే నాన్నగారు లాక్కొచ్చి పెళ్లి చేస్తారనే ధైర్యమా?

విష్ణు: ఆ నిమిషానికి నాకు నాన్న గుర్తురాలేదు. ఆరు నెలల తర్వాత అరరె.. నాన్నకు చెప్పాలి కదా అని అనిపించింది. ఒక సంవత్సరం నాన్నకు తెలియకుండా చూసుకున్నాను. కానీ అమ్మకు ముందే తెలిసిపోయింది. ఆఫీస్‌లో నాన్న ఉంటారు. బయట కలవలేము. అందుకే మేమిద్దరం తాజ్‌కృష్ణలో రోజూ లంచ్‌కి కలిసేవాళ్లం. ఈ విషయం ఓ ఇంగ్లీష్‌ పేపర్‌లో వచ్చింది. ఆయన స్నేహితుల ద్వారా నాన్నగారికి మా విషయం తెలిసిపోయింది. ఆయన పిలిచి ఏంట్రా ఇలా అంతా వస్తోంది. ఏమనుకుంటున్నావు అని కోప్పడ్డారు. నేను వెళ్లి ఏడ్చేశాను. మరుసటి రోజు దాసరి పద్మగారు వచ్చి నాన్నను కోప్పడ్డారు. అయితే నాన్నెప్పుడు నో అని చెప్పలేదు. తను చెప్పిన అమ్మాయిని చేసుకోవాలని ఆయన కోరిక. ఇదంతా తనకు తెలియకుండా ఎందుకు జరిగిందన్న కోపం ఉండేది అంతే. బ్రహ్మానందం అంకుల్‌ కూడా ఇంటికొచ్చి నాన్నతో మాట్లాడారు. నాన్న వెళ్లిపోయాక 'ఆ అమ్మాయినే నువ్వు చేసుకుంటున్నావు రా. ఆయన ఎలా ఒప్పుకోడో చూస్తా' అని సవాలు చేసి వెళ్లారు. రెండు మూడు రోజులు ఈ డ్రామా అంతా జరిగింది. ఆ తర్వాత నాన్న వాళ్లింట్లో చెప్పిన మూడు నెలల్లోనే నిశ్చితార్ధం జరిగిపోయింది.

ఎంగేజ్‌మెంట్‌కు కొన్ని రోజుల ముందు ఓ ఛానెల్‌పైకి నాన్న సీరియస్‌గా వెళ్లారు. ఏంటది?

విష్ణు: మా కుటుంబాలు కలిసే టైంలో ఓ ఛానెల్‌లో మా ఇద్దరి పెళ్లి గురించి బ్రేకింగ్‌ న్యూస్‌ వేశారు. అప్పటికీ విన్నీ వాళ్ల పెద్దనాన్న రాజశేఖర్‌ రెడ్డిగారు సీఎంగా ఉన్నారు. అప్పుడది హాట్‌ న్యూస్‌. అయితే ఫ్యామిలీకి చెప్పక ముందే ఛానెల్లో బ్రేకింగ్‌ న్యూస్‌ వచ్చేసింది. పదిమందికి చెప్పేలోపల ఛానెల్‌ వాళ్లు బయటపెట్టేసి తనను అవమానించారని నాన్నగారికి కోపం. అందుకే ఆవేశంగా వెళ్లారు. నేను వెంటనే ఛానల్‌ వాళ్లకి ఫోన్‌ చేసి చెప్పేశాను. అప్పుడు అలా అయిపోయిందది.

నానమ్మ, తాతగారిలో ఎవరికి కోపమెక్కువుండేది?

విష్ణు: మా తాతకు ఇంత కోపం లేదు. చనిపోయే ముందు 96 ఏళ్ల వయసులో కూడా ఆయన క్లాసులు చెప్పేందుకు వెళ్లారు. నానమ్మకు మాత్రం కోపమెక్కువుండేది. ఆ కోపం, చికాకు ఆమెనుంచే వచ్చినవే. నానమ్మ జిరాక్స్‌ కాపీ మా నాన్న.

ఒక సీరియస్‌ ప్రశ్న. మీకు మనోజ్‌కు పడేట్లేదనే వార్తకి మీరిచ్చే సమాధానం?

విష్ణు: నేనెందుకు సమాధానం ఇవ్వాలి. దీనికి సమాధానం ఇవ్వడం టైం వేస్ట్‌. మనోజ్‌, అక్క ఇద్దరూ సపరేట్‌గా ఉంటున్నారు. నేను నాన్నతో ఉంటున్నాను. అంతమాత్రాన మాట్లాడుకోవడం లేదనడంలో అర్థం లేదు.

లక్ష్మి, మనోజ్‌, విష్ణు స్క్రిప్ట్‌లలో పెడతారు. అందుకే విజయాలు తక్కువని అంటారు. దీనికి మీరేమంటారు?

విష్ణు: తమ్ముడి గురించి నాకు తెలియదు. నా విషయానికి వస్తే, సెట్‌కు వెళ్లకముందు ఎన్నైనా అనుకుంటాం. కానీ ఒకసారి షూటింగ్‌ మొదలయ్యాక డైరెక్టర్‌ చెప్పినట్లు చేస్తాను. అంతే. ఆ పద్ధతి బట్టే.. నాకు హిట్స్‌, ఫ్లాప్స్‌ వచ్చాయి.

మీ కుటుంబంలోని నలుగురు కలిసి సినిమా ఎందుకు చేయలేదు?

విష్ణు: మాకు సరైన స్ర్కిప్ట్‌ రాలేదు. మేం ముగ్గురం కలిసి 'పాండవులు పాండవులు తుమ్మెద' చేశాం. అది విజయం సాధించింది. కానీ అంత కన్నా మంచి సినిమా చేయాలని ఉంది. అలాంటి గొప్ప స్ర్కిప్ట్‌ వస్తే కచ్చితంగా చేస్తాం. అంతేకాదు దానికి నేనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తాను.

24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ఇంకా నడుస్తోందా?

విష్ణు: బ్రహ్మాండంగా నడుస్తోంది. నవంబర్‌లో 14 సినిమాలను ప్రకటించనున్నాం. 3, 4 ఏళ్లుగా మొత్తం కథల మీదే పెట్టుబడి పెట్టాను. గత ఐదేళ్ల నుంచి ట్రెండ్‌ మారుతూ వస్తోంది. ఓటీటీల్లో సినిమాలు చూసేవారు, థియేటర్‌కు వచ్చి చూడరు. కానీ థియేటర్‌లో చూసే ప్రేక్షకులు కచ్చితంగా ఓటీటీల్లో కూడా సినిమాలు చూస్తారు. అందుకే ఓటీటీల్లో నిర్మాణంలోకి దిగాలని నాన్నకు చెప్పాను. శ్రీకాంత్‌తో ఒక వెబ్‌సిరీస్‌ చేశాం. దానికి మంచి గుర్తింపు వచ్చింది. 5 ఏళ్లుగా నా సంపాదనంతా ఈ కథల మీదే పెట్టాను.

మన బ్యానర్‌లో ఏ సినిమా అంటే బాగా ఇష్టం?

విష్ణు: 'అల్లుడుగారు'. నా హృదయానికి దగ్గరైన కథ. 'పెదరాయుడు', 'రాయలసీమ రామన్న చౌదరి' సినిమాలు ఇష్టమే కానీ, అలాంటివి సినిమాలు నేను చేయలేను. నాన్నగారి సినిమాల్లో 'అల్లుడుగారు', 'ఎమ్‌. ధర్మరాజు ఎంఏ' చిత్రాలు చేయాలని ఉంది.

నాన్న పిల్లలతో తెలుగులో మాట్లాడితే మీకు జ్వరమొస్తుందంటా? ఎందుకు?

విష్ణు: పిల్లలు తెలుగులో మాట్లాడేటప్పుడు నాకు తిట్లు పడతాయి. ముఖ్యంగా అరియానా, వివియానా మాట్లాడితే తెలుగు నేర్పించమని నాన్నతో చివాట్లు పడతాయి. నా చిన్న బిడ్డ నాకన్నా స్పష్టంగా నాన్నతో తెలుగులో మాట్లాడుతుంది. అవ్రామ్‌ కూడా అంతే. వీరిద్దరికి తెలుగు నేర్పండి. వాళ్లిద్దరినీ వదిలేయమని చెబుతాను.

నలుగురితో ఆపేస్తావా? ఈ సంఖ్యను అరడజన్‌ చేస్తావా?

విష్ణు: నాకు పిల్లలంటే ఇష్టం. పది, పదిహేను మంది పిల్లలున్నా ఓకే. షూటింగ్‌ సమయంలో కూడా పిల్లలు ఎక్కడుంటే, అక్కడికి వెళ్లిపోతా. పిల్లల విషయంలో మేం ఏదీ ప్లాన్‌ చేసుకోలేదు. నాకు కూతురు కావాలని ఉండేది. విన్నీకి కొడుకు కావాలని ఉండేది. అలా జరిగిపోయాయంతే. ఆమె ప్రెగ్నెన్సీ సమయంలో నాకు ఆడవాళ్ల మీద మిలియన్‌ రెట్లు గౌరవం పెరిగింది. వాళ్ల చిటికెన వేలుకు కూడా మనం సరిపోము. విన్నీ కుటుంబం ప్రతివారం కలుసుకుంటారు. నేను కూడా హాజరయ్యాను. ఆమె ప్రెగ్నెంట్‌ అని అందరికీ తెలిసిపోయింది. అప్పటికే మాకు ముగ్గురు పిల్లలు. షర్మిలక్క కనిపించగానే 'మా విన్నీని ఇబ్బందిపెట్టడం ఆపెయ్‌' అని వెళ్లిపోయారు. ఆ వెంటనే జగన్‌ గారొచ్చి 'విష్ణూ మా సిస్టర్‌ని ఎందుకంతా ఇబ్బందిపెడుతున్నావు. నలుగురు పిల్లలు చాలు' అంటూ కోప్పడ్డారు. అదొక ఫన్నీ ఇన్సిడెంట్‌. అందరూ అభినందనలు చెబుతూనే తిట్టడం మొదలెట్టేవారు.

హమ్మయ్యా! అయితే ఇక నలుగురితో ఆపేసినట్టేనా?

విష్ణు: విన్నీని మరో బిడ్డ కావాలా అని అడిగితే 'మరొకరిని చూసుకోపో' అని కసురుకుంది. (నవ్వులు)

కాజల్‌ లాంటి పెద్ద హీరోయిన్‌కి సోదరుడిగా చేయాలని ఎందుకనిపించింది?

విష్ణు: కథ మీద నాకు విపరీతమైన నమ్మకం. నాకు సోదరిగా చేసేందుకు ఒప్పుకోవడం గ్రేట్‌. ఆ పాత్రకు కాజల్‌ పూర్తి న్యాయం చేసింది.

భవిష్యత్‌లో ఏమవుదామని అనుకుంటున్నారు?

విష్ణు: భారతదేశం గర్వించదగ్గ నటుడు అవ్వాలనేది నా లక్ష్యం. ఈ ప్రపంచం నన్నొక మంచి నటుడిగా గౌరవించాలి. నాకున్న లక్ష్యం అదొక్కటే.

ఇంటర్వ్యూలకు, షోలకు ఎందుకు దూరంగా ఉంటారు?

విష్ణు: నాకు ఇంటర్వ్యూలు, షోలు ఇవ్వాలంటే భయం. నటుడిగా నా సినిమాలు మాట్లాడితే చాలు కదా అనిపిస్తుంది. సినిమా ప్రచారం సమయంలో ఎంతమంది ఇంటర్వ్యూ చేసినా అడిగే ప్రశ్నలు మాత్రం ఒకేలా ఉంటాయి. అవి నాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. అయితే కెమెరా ముందు ఎంతమంది ముందైనా నటించగలను. నిజజీవితంలో నటించలేను.

రెగ్యులర్‌గా కలిసే హీరోలెవరు?

విష్ణు: చాలా మంది ఉన్నారు. కల్యాణ్‌రామ్‌, నితిన్‌, సునీల్‌ ఇలా చాలా మందిని కలుస్తూ ఉంటాను. ప్రభాస్‌తో ఏడాదికో సారి కలవాలన్న ఒప్పందం కూడా ఉంది. అల్లుఅర్జున్‌, మహేశ్‌లతో టచ్‌లోనే ఉంటాను. గోపీచంద్‌ కూడా ఇష్టమే. మా జనరేషన్‌ కన్నా, మీ తరం వారిని కలిసి అప్పటి అనుభవాలు తెలుసుకోవడం సరదాగా ఉంటుంది.

ఫుడ్‌ప్రాసెసింగ్‌ మిషన్‌ ఏదో కనిపెట్టారట? దానికి డిమాండ్‌ కూడా ఎక్కువని తెలిసింది? ఏంటా కథ?

విష్ణు: విద్యానికేతన్‌లో పూటకు పదివేలమంది భోజనం చేస్తారు. స్కూల్‌ను నడపడం ఒకెత్తు. కిచెన్‌ను నడపడం ఒకెత్తు. ప్రపంచంలో సాంకేతికంగా ఎంతో వృద్ధి జరిగింది. ఫుడ్‌ తయారీని ఎందుకు ఆటోమేషన్‌ చేయకూడదనే ఆలోచన వచ్చింది. మనకు కావాల్సిన వంటకాన్ని అదే ఎందుకు తయారు చేసి ఇవ్వకూడదనే ఆలోచనతో ఈ మిషన్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. దానికి పేటేంట్‌ కూడా తీసుకున్నాం. మక్కా నిర్వాహకులు తెలుసుకొని సంప్రదించారు. ఇది వర్కౌట్‌ అయితే రోజుకు 40వేల మందికి భోజనం తయారు చేసి ఇవ్వొచ్చు.

సినిమా పూర్తయ్యాక ఇంట్లో చూపిస్తారా?

విష్ణు: మా ఇంట్లో అందరం కలిసి చూస్తాం. విన్నీ ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తుంది. మా అమ్మ కూడా మంచి విమర్శకురాలు. మా నాన్న, అమ్మ తర్వాత అంతగా భయపడేది విన్నీకే. ఒకరకంగా హడల్‌.

నాన్న గారి డైలాగ్స్‌లో మీకు నచ్చిందేంటి?

విష్ణు: 'అల్లుడు గారు'లో ఒక డైలాగ్‌ ఉంటుంది. 'బాధపెట్టే నిజం కన్నా, సంతోషపట్టే అబద్ధమే మంచిది' అనే డైలాగ్‌ ఇష్టం. 'రాయలసీమ రామన్న చౌదరి'లో.. 'నారు పెట్టకుండా, నీరు పెట్టకుండా పెరిగేది ఒకటే. అది నా అహంకారం. అది నా సొంతం' అనేది కూడా బ్యూటిఫుల్‌ డైలాగ్‌. 'అడవిలో అన్న' చిత్రంలోని రైతుల గురించి చెప్పే డైలాగ్‌ అంటే విపరీతమైన ఇష్టం. 'వడ్లు దంచి వండిపెడితే, ఆ పళ్లెం ముందు పడి తినే కుక్కవురా నువ్వు' అనే ఈ డైలాగ్‌ను ఇప్పటికీ మనోజ్‌, నేనూ ఇమిటేట్‌ చేస్తూ ఉంటాం.

నాన్నగారిలో నచ్చే విషయం, నచ్చని విషయం.

విష్ణు: నచ్చింది, నచ్చనిది రెండూ ఆవేశమే. ఆయన ప్రేమిస్తే విపరీతంగా ప్రేమిస్తారు, లేదా విపరీతంగా బాధపడిపోతారు. కోపంలో అప్పటికప్పుడు మాట అనేస్తారు. కానీ ఆయన గుండెల్లో ఏదీ దాచుకోకుండా మాట్లాడతారు. ఆ గుణం నాకు రాలేదు. నేను రాముడిని కాదు, రావణుడిని. జనాలకు ఏమో కానీ వినీకి 100 శాతం క్లారిటీ ఉంది నేను రావణుడినని(నవ్వులు).

ఈ షో ఎలా ఉంది? ఇదే విషయాన్ని మెహన్‌బాబుగారికి చెప్పండి

విష్ణు: తప్పకుండా చెబుతాను. ఆయన వచ్చేటట్టు చూద్దాం. థ్యాంక్యూ అంకుల్‌.(నవ్వులు)

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. బికినీలో 'బిగ్​బాస్​' బ్యూటీ.. పోజు అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.