Pawan kalyan bheemla nayak: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' రిలీజ్‌కు రెడీ అయింది. తెలంగాణలో బెన్ఫిట్ షోలు పడుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మార్నింగ్ షో నుంచి ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించనుంది. మలయాళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కినప్పటికీ.. ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి చూద్దాం.
- పవన్ కల్యాణ్ పోలీసు దుస్తుల్లో కనిపించిన నాలుగో సినిమా ఇది. అంతకు ముందు 'పులి', 'గబ్బర్ సింగ్', 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాల్లో పోలీస్ రోల్స్ చేశారు.
- పవన్ నటిస్తున్న రెండో మల్టీస్టారర్ ఇది. గతంలో బాబాయ్ విక్టరీ వెంకటేశ్‌తో 'గోపాల గోపాల' చేయగా, ఇప్పుడీ సినిమాలో అబ్బాయ్ రానాతో కలిసి తెర పంచుకున్నారు.
- ఈ సినిమాలో పవన్, 'భీమ్లా నాయక్' అనే గిరిజన ఎస్సై పాత్ర చేయడం విశేషం. ఇటీవల కాలంలో ఓ అగ్రకథానాయకుడు.. ట్రైబల్ రోల్ చేయడం వల్ల సినిమా ప్రాధాన్యం సంతరించుకుంది.
- 'అల వైకుంఠపురములో' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్.. ఈ సినిమా కోసం పనిచేశారు. అయితే దర్శకుడిగా కాకుండా కేవలం స్క్రీన్‌ప్లే-మాటలు అందించారు.
- అభిమానుల్ని తెగ అలరిస్తూ సినిమాపై అంచనాల్ని తెగ పెంచేసిన 'లా లా భీమ్లా' పాటను త్రివిక్రమ్ రాయడం మరో విశేషం.
- 'బాహుబలి' సినిమాలో భళ్లాలదేవగా అలరించిన రానా.. ఇందులో పవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దీంతో సినిమాలో వీరిద్దరి మధ్య సన్నివేశాల కోసం ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
- ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామేనన్ నటించింది. ఈమెది ఓ పవర్ఫుల్ రోల్ అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. రానాకు జోడీగా మలయాళ బ్యూటీ సంయుక్త మేనన్ నటించింది. ఈమెకు తెలుగులో ఇదే తొలి సినిమా కావడం విశేషం.
- పవన్ రీఎంట్రీ మూవీ 'వకీల్‌సాబ్'కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన తమన్.. ఈ సినిమా కోసం అంతకు మించి పనిచేసినట్లు తెలుస్తోంది. థియేటర్లలో 'భీమ్లా నాయక్' మోత మోగడం ఖాయంగా కనిపిస్తుంది.
- 2012లో 'అయ్యారే' సినిమాతో ఆకట్టుకున్న సాగర్ కె చంద్ర.. 2016లో 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇప్పుడు మూడో సినిమాతో ఏకంగా పవన్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు.
- మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోశియుమ్'కు తెలుగు రీమేక్ 'భీమ్లా నాయక్'. ఒరిజినల్లో బిజు మేనన్ పాత్ర పవన్, పృథ్వీరాజ్ పాత్రను రానా పోషించారు.
ఇవీ చదవండి: