ETV Bharat / sitara

చైతూ-సమంత విడాకులు.. వెంకటేశ్​ పోస్ట్​ వైరల్ - వెంకటేశ్ నాగచైతన్య సమంత

భార్యాభర్తల బంధాన్ని ముగిస్తున్నట్లు వెల్లడించి అందరినీ షాక్​కు గురిచేసింది నాగ చైతన్య-సమంత జోడీ(naga chaitanya samantha latest pics). ఈ విషయంపై ఇప్పటికే పలువురు తమ అభిప్రాయం తెలిపారు. తాజాగా నటుడు వెంకటేశ్ నెట్టింట ఓ పోస్ట్ చేశారు.

Venkatesh
వెంకటేశ్
author img

By

Published : Oct 6, 2021, 11:35 AM IST

ఇకపై భార్యాభర్తలుగా కలిసి ఉండటం లేదంటూ ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశారు నాగచైతన్య-సమంత జోడీ(naga chaitanya samantha latest pics). ఈ ప్రకటనపై అక్కినేని కుటుంబానికి చెందిన పలువురు తారలు.. సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు వాళ్లిద్దరూ విడిపోవడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా నటుడు వెంకటేశ్‌(venkatesh daggubati movies) పెట్టిన ఓ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

"మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి" అంటూ వెంకీ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజా పరిస్థితులకు అనుగుణంగానే ఆయన ఈ పోస్ట్‌ పెట్టారా? అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది..: సామ్‌ తండ్రి

సామ్‌-చైతూ నిర్ణయంపై తాజాగా సమంత తండ్రి జోసఫ్ ప్రభు( samantha father joseph prabhu) స్పందించారు. వాళ్ల జోడీ చూడముచ్చటగా ఉండేదని.. అలాంటిది, ఇప్పుడు వాళ్లిద్దరూ విడిపోవడం దురదృష్టకరమని అన్నారు. అలాగే.. వాళ్లిద్దరూ విడిపోతున్నారని తెలిసి మైండ్‌ బ్లాంక్ అయ్యిందని.. ఏం చేయాలో అర్థం కాలేదని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నట్లు వివరించారు.

ఇవీ చూడండి: క్రిప్టో కరెన్సీతో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్​ కొనుగోలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.