ETV Bharat / sitara

హీరో వరుణ్​తేజ్​తో పెళ్లి.. లావణ్య త్రిపాఠి క్లారిటీ - వరుణ్ తేజ్ గని మూవీ

Varun tej marriage: మెగాహీరో వరుణ్​తేజ్ తనతో ప్రేమలో ఉన్నారని వార్తలపై హీరోయిన్ లావణ్య త్రిపాఠి పరోక్షంగా స్పందించారు. ప్రస్తుతం తాను సొంతూరిలో ఉన్నానని క్లారిటీ ఇచ్చి పుకార్లకు చెక్ పెట్టారు.

varun tej lavanya tripathi marriage
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి
author img

By

Published : Jan 20, 2022, 2:25 PM IST

Updated : Jan 20, 2022, 2:42 PM IST

Varun tej lavanya tripathi dating: మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో పెళ్లి అంటూ వస్తున్న పుకార్లకు ఫొటోలతో సమాధానమిచ్చింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం తాను సొంతూరులో కుటుంబంతో ఉన్నట్లు చెప్పింది. దీంతో బుధవారం ఉదయం నుంచి వస్తున్న పెళ్లి పుకార్లకు తెరపడినట్లయింది. వరుణ్‌తేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన కొన్ని ఫొటోల వల్లే ఇదంతా జరిగింది.

ఇంతకీ ఏమైందంటే?

వరుణ్‌ తేజ్‌ హీరోగా చేసిన 'మిస్టర్‌', 'అంతరిక్షం' సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది లావణ్య త్రిపాఠి. ఆ రెండు చిత్రాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ఆ మధ్య అందరూ చెవులు కొరుక్కున్నారు. అంతేకాకుండా వరుణ్‌ సోదరి నటి నిహారిక పెళ్లికి లావణ్య హాజరైంది. దీంతో ఆ వార్తలకు మరింత బలం వచ్చింది. కానీ ఆ తర్వాత ఎలాంటి పుకార్లూ రాలేదు. బుధవారం వరుణ్‌ పుట్టిన రోజు కావడం వల్ల, వేడుకల కోసం వరుణ్‌ బెంగళూరు వెళ్లారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. దీంతో పుకార్ల తాకిడి మళ్లీ మొదలైంది.

lavanya tripathi
లావణ్య త్రిపాఠి ఇన్​స్టా పోస్ట్

లావణ్యతో కలిసి బర్త్‌డే పార్టీ స్పెషల్‌గా చేసుకోవడానికే వరుణ్‌ బెంగళూరు వెళ్లారని, ఆమె కోసం అత్యంత ఖరీదైన డైమండ్‌ రింగ్‌ కొనుగోలు చేశారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలు ఆ నోట ఈ నోట పడి లావణ్య దగ్గరకు చేరినట్లున్నాయి. దీంతో వాటిపై సోషల్‌ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించారు లావణ్య. దేహ్రాదూన్‌లో ఉన్నానంటూ ఫ్యామిలీతో కలిసి ఉన్నట్లు కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారామె. ప్రకృతి అందాలు తన మనసును కట్టిపడేస్తున్నాయని ఆ ఫొటోలతోపాటు పోస్టులో రాసుకొచ్చారు. లావణ్య షేర్‌ చేసిన కొత్త ఫొటోలతో ఆమె పెళ్లి, ప్రేమ వార్తలకు మరోసారి చెక్‌ పడినట్లు అయ్యింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

Last Updated : Jan 20, 2022, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.