ETV Bharat / sitara

మీసం తిప్పుతానంటున్న శ్రీ విష్ణు.. ఎందుకంటే..!

శ్రీ విష్ణు, నిక్కీ తంబోలి జంటగా నటిస్తున్న 'తిప్పరా మీసం' చిత్రం వచ్చే నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో చిత్ర బృందం సందడి చేసింది. ఈ సినిమాలో తన పాత్ర ఇంతకుముందు చిత్రాల కంటే భిన్నంగా ఉంటుందని శ్రీ విష్ణు తెలిపారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పక నచ్చుతుందన్నారు.

author img

By

Published : Oct 28, 2019, 7:18 PM IST

మీసం తిప్పుతానంటున్న శ్రీ విష్ణు.. ఎందుకంటే..!
మీసం తిప్పుతానంటున్న శ్రీ విష్ణు.. ఎందుకంటే..!
రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ ఓం సినిమాస్ పతాకాలపై కృష్ణ విజయ్ దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మించిన 'తిప్పరా మీసం' చిత్రం నవంబర్ 8వ తేదీన విడుదల కాబోతుందని చిత్ర కథానాయకుడు శ్రీ విష్ణు తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్​లో చిత్రబృందం సందడి చేసింది. శ్రీ విష్ణు మాట్లాడుతూ.. తన గత సినిమాలు కన్నా విభిన్నంగా ఈ చిత్రం ఉండబోతుందని... పూర్తిగా సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా అన్నారు. తన స్వస్థలమైన విజయవాడ నుంచి చిత్ర ప్రచారాన్ని మొదలుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో మంచి గుర్తింపు తెచ్చే పాత్రలో నటించానని కథానాయిక నిక్కీ తంబోలి అన్నారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తిప్పరా ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందని, విష్ణు విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తుంటారని నటుడు నవీన్ అన్నారు. తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు.

ఇదీ చదవండి :

'ఈ నగరానికి ఏమైంది'కి సీక్వెల్​.. కానీ!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.