AP Ticket Rates Issue: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సినిమా టికెట్ ధరల విషయంపై ఇంకా ఆ ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నామని నిర్మాత డీవీవీ దానయ్య తెలిపారు. ఇటీవల విడుదలైన 'ఆర్‌ఆర్‌ఆర్' ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తోన్న తరుణంలో చిత్రబృందం తాజాగా విలేకర్ల సమావేశం నిర్వహించింది.
హైదరాబాద్‌లో శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో రాజమౌళి, చరణ్, తారక్‌తోపాటు దానయ్య పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఓ విలేకరి.. "ఏపీలో సినిమా టికెట్ ధరల విషయంలో మీరు ఎన్టీఆర్ సాయం ఏమైనా తీసుకుంటారా? ఎందుకంటే ఎన్టీఆర్‌కు ఆప్తులైన ఇద్దరు వ్యక్తులు అక్కడ మంచి స్థాయిలో ఉన్నారు కదా? అని ప్రశ్నించగా.. "సినిమా టికెట్ ధరల విషయంపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే ఓ కొలిక్కి వస్తోందని భావిస్తున్నాం" అని దానయ్య తెలిపారు.
ఇదీ చూడండి: RRR Press meet: 'అందుకే మాది నిజమైన స్నేహం'